బాస‌ర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల‌కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా జులై 3న విడుద‌లైంది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన విద్యార్థుల జాబితాను అందుబాటులో ఉంచారు. తొలిదశలో మొత్తం 1404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీకిలో ఓపెన్ కేట‌గిరిలో 640 మంది విద్యార్థులు, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 118 మంది, బీసీ కేట‌గిరిలో 346 మంది, ఎస్సీ కేట‌గిరిలో 178 మంది, ఎస్‌టీ కేట‌గిరిలో 119 మంది విద్యార్థులు ఎంపిక‌య్యారు. 



తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థుల‌కు జులై 7 నుంచి 9 వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. జాబితాలో 1వ నెంబరు నుంచి 500 వ‌ర‌కు జులై 7న, 501 నుంచి 1000 వ‌ర‌కు జులై 8న, 1001 నుంచి 1404 వ‌రకు జులై 9న కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. అలాగే దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు జులై 14న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ఎన్‌సీసీ, క్యాప్ విభాగాలకు చెందినవారికి జులై 15న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు యూనివ‌ర్సిటీ అధికారులు వెల్లడించారు. 


ఎంపిక జాబితా కోసం క్లిక్ చేయండి..


Call Letter for Counseling


కౌన్సెలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరం..


కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు, ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.


1) పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్


2) పదోతరగతి మార్కుల జాబితా (గ్రేడ్-షీట్)


3) 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికేట్లు.


4) రెసిడెన్స్ సర్టిఫికేట్


5) క్యాస్ట్/కమ్యూనిటీ/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.


6) ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01.04.2023 తర్వాత జారీచేసినది).


7) విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలతోపాటు, ఇద్దరు గార్డియన్‌ల ఫోటోలు ఉండాలి. 


8) ఫ్యామిలీ రేషన్ కార్డు కాపీ. 


9) ఆధార్ కార్డు. 


10) చదువు కోసం బ్యాంకు రుణం కోరేవారు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు క్యాంపస్‌లో బ్యాంకులో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుతోపాటు కింది డాక్యుమెంట్లు అవసరమవుతాయి.


➥ 4 సెట్ల సర్టిఫికేటల్ కాపీలు 


➥ తల్లిదండ్రులు ఉద్యోగులైతే ఎంప్లాయి ఐడీ కార్డు కాపీ. 


➥ గడచిన 3 నెలల శాలరీ సర్టిఫికేట్లు (పే స్లిప్స్) 


➥ విద్యార్థి, తల్లిదండ్రుల పాన్‌కార్డు


➥ రేషన్ కార్డు/పాన్‌కార్డు/ఓటరు ఐడీకార్డు/ఆధార్ కార్డు (విద్యార్థి, తల్లిదండ్రుల)


➥ చివరి 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్.


➥ విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలు నాలుగు అవసరమవుతాయి.


ALSO READ:


తెలంగాణలో టాప్-10 ఇంజనీరింగ్ కళాశాలలు ఇవే, ఓ లుక్కేయండి!
అద్భుతమైన మౌలిక సదుపాయాలు, అంతకు మించి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన, ప్లేస్ మెంట్ ఉద్యోగాలు కల్పించే ఉత్తమమైన తెలంగాణలోని టాప్ - 10 ఇంజనీరింగ్ కళాశాలలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టాప్ కాలేజీల్లో చదివిన వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 
కళాశాలల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial