Horoscope Today (జూలై 4 రాశిఫలాలు)


మేష రాశి  
ఈ రాశివారికి ఈ రోజు లాభ దాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల సలహాలు పాటిస్తారు, వారినుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతారు. వ్యక్తిగత సంబంధాలపై నమ్మకం పెరుగుతుంది. చేసే పనిలో సంతృప్తి పొందుతారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థిక వృద్ధి ఉంటుంది. చేసేపనిలో స్పష్టత కొనసాగుతుంది. సామరస్యంతో విజయం సాధిస్తారు. విశ్వాసంగా ముందుకు సాగుతారు. పరిస్థితులు మీకు సానుకూలంగా ఉంటాయి. సమర్థతతో అన్నీ నెట్టుకొస్తారు. మీకు కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్యలు 3, 8 , 9 .


వృషభ రాశి  
ఈ రాశివారు నిపుణులతో కలిసి కొనసాగుతారు. సేవా రంగానికి సంబంధించిన వ్యక్తులు చురుగ్గా, మెరుగ్గా పని చేస్తారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యక్తిగత కార్యక్రమాలు  పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాముల సహకారం ఉంటుంది. చర్చలలో క్రియాశీలతను ప్రదర్శిస్తారు. వ్యక్తిగత విషయాలపై ఆసక్తి ఉంటుంది. కష్టపడి, నమ్మకంతో లక్ష్యాన్ని సాధిస్తారు.  ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు  సాధారణంగా ఉంటుంది. లావాదేవీలలో సహనం పాటించండి.  కొన్ని పనులు పెండింగ్‌లో ఉండిపోయే అవకాశముంది. అదృష్ట రంగు: గ్రే , అదృష్ట సంఖ్యలు: 3, 6, 8.  


మిథున రాశి 
ఈ రాశివారు అనుకున్న పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేస్తారు, లాభం పొందుతారు.  పారిశ్రామిక వర్గాల్లో చైతన్యం పెరుగుతుంది. ప్రణాళిక ప్రకారం పనిచేసి లాభం గడిస్తారు. పనిలో అలసత్వం తగ్గించి హుషారుగా పని చేయండి. ఆర్ధిక లావాదేవీల్లో స్పష్టత ఉండాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో వేగంగా పనులు పూర్తి చేయండి. సహోద్యోగులపై విశ్వాసం ఉంటుంది. నిర్వహణ పనులను ముందుకు తీసుకెళ్తారు.  అదృష్ట సంఖ్యలు: 2, 3, 5 - అదృష్ట రంగు: పింక్


కర్కాటక రాశి 
ఈ రాశివారు సేవాభావంతో మెలుగుతారు. పనిలో వేగం పుంజుకుంటుంది. కార్యాలయంలో మెరుగైన పనితీరు కనబరుస్తారు. సహచరులతో అన్యోన్యంగా ఉంటారు. సమయపాలన పాటించాలి. వ్యక్తిగత విషయాలు పరిష్కార మవకుండా పెండింగ్‌లో ఉండిపోతాయి. పరిస్థితులు సవాలుగా మారతాయి. ఎవరికీ సలహా ఇవ్వకండి. సహోద్యోగుల సహకారం ఉంటుంది. మీ పనిపై మీరు దృష్టి సారిస్తారు.  సామరస్యంతో ముందుకు సాగండి. అదృష్ట సంఖ్యలు: 1, 2, 3 , 8 , అదృష్ట రంగు: లేత గులాబీ


Also Read: గురుపూర్ణిమతో మొదలయ్యే ఈ వారం ఈ రాశులవారికి గుడ్ న్యూస్ తెస్తోంది!


సింహ రాశి  
ఈ రాశివారు కెరీర్ కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అవగాహన తో సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఈరోజు సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాలపై ముందుగా శ్రద్ధ వహించండి. లక్ష్యంపై దృష్టి ఉంటుంది. వివిధ కార్యక్రమాలలో ముందుంటారు. కుటుంబంతో సమయం గడుపుతారు. పని సంబంధాల పట్ల సున్నితత్వాన్ని కొనసాగిస్తారు. ఏదో ఒక పనిలో నిరంతరాయంగా శ్రమిస్తారు. అదృష్ట సంఖ్యలు: 1, 2 , 3 -అదృష్ట రంగు: ముదురు ఎరుపు


కన్యా రాశి 
ఈ రాశివారు కుటుంబ నిర్వహణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. ఈరోజు ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కాపాడుకోండి. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. రక్త సంబంధీకులతో సంతోషాన్ని పంచుకుంటారు. ముఖ్యమైన పనులపై దృష్టి పెడతారు. సామరస్య భావన పెరుగుతుంది. అతిథులు వచ్చే అవకాశముంది. అదృష్ట సంఖ్యలు: 2, 5 , 8  - అదృష్ట రంగు: నీలం


తులా రాశి 
ఈ రాశివారు పనిలో చురుగ్గా ఉంటారు. చేసే పనుల్లో వేగం పెంచి, విజయం సాధిస్తారు. మీ మంచి మనస్సే మంచి ఫలితాలనిస్తుంది. మీరు చేసే పనిలో మీ  శైలి ప్రభావవంతంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులతో అనుబంధం కలుగుతుంది. దానధర్మాలు చేస్తారు. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. బాధ్యతలపై దృష్టి సారిస్తారు. అదృష్ట సంఖ్యలు: 2, 6 , 8 - అదృష్ట రంగు: ఆకుపచ్చ


వృశ్చిక రాశి 
ఈరోజు బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మీయులను కలుస్తారు. వ్యక్తిగత విషయాలలో మెరుగైన పనితీరు ఉంటుంది. పెద్దలను గౌరవిస్తారు. మర్యాదగా నడుచుకుంటారు. బాధ్యతలు నిర్వర్తిస్తారు.  కుటుంబ విషయాలు సానుకూలంగా ఉంటాయి. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. అదృష్ట సంఖ్య: 3 , 9 . అదృష్ట రంగు: పసుపు


Also Read: జూలై నెలలో ఈ రాశులవారికి గ్రహస్థితి బావుంది, మీ రాశి ఉందా ఇందులో!


ధనుస్సు రాశి  
ఈ రాశివారికి వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది.  ఈరోజు మీ అధికారులని ఆకట్టుకుంటారు. సంతోషం రెట్టింపు అవుతుంది. ప్రణాళిక ప్రకారం పనులు వేగాన్ని కొనసాగిస్తారు. అవగాహనతో ముందుకు సాగుతారు.ఎదుటి వారితో  మర్యాద, పూర్వకంగా ప్రవర్తిస్తారు. అవసరమైన నిర్ణయాలు తీసుకోకండి. సన్నిహితుల మద్దతు లభిస్తుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. అదృష్ట సంఖ్యలు: 2, 3 , 8 . అదృష్ట రంగు: కుంకుమపువ్వు


మకర రాశి 
ఈ రోజు ఏదో పనిపై బయటకు వెళ్ళవలసి వస్తుంది. సంబంధ భాంధవ్యాలలో  సంప్రదింపులు మెరుగ్గా  ఉంటాయి. ఈరోజు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు. ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. లావాదేవీలపై దృష్టి సారిస్తారు. న్యాయపరమైన విషయాల్లో సహనం పెంచుకోండి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద లక్ష్యాలను సాధిస్తారు. అధికారులు సహకరిస్తారు. బలహీనతలు జయిస్తారు. అదృష్ట సంఖ్యలు: 2, 3 , 8- అదృష్ట రంగు: తెలుపు


కుంభ రాశి 
ఈ రాశివారు కెరీర్ సంబంధిత విషయాలలో విజయం సాధిస్తారు. ఒప్పందాలలో వేగంగా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు సహకారం లభిస్తుంది. ప్రతిభ మెరుగుపడుతుంది. పదవిలో  ప్రతిష్ట పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కార్యాలయంలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగం వలన ప్రయోజనం పొందుతారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు.  అధికారుల మద్దతు ఉంటుంది. అదృష్ట సంఖ్యలు: 2, 3, 5, 8


మీన రాశి  
ఈ రోజు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సృజనాత్మక ఆలోచన బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు పెద్దల మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. కమ్యూనికేషన్స్ పెరుగుతాయి.  కుటుంబ సభ్యులలో సంతోషం ఉంటుంది. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అదృష్ట సంఖ్యలు: 2, 3 , 8 . అదృష్ట రంగు: గోల్డ్ 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial