ఈ రోజు ఆవర్తనం నైరుతి, పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలో మీటర్ల నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల రేపు, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 9 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
‘‘నేడు మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటుగా కాకినాడ జిల్లాలోని పలు భాగాల్లో విస్తారంగా వర్షాలు నమోదవ్వడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతోంది. సాయంకాలం నుంచి అర్ధరాత్రి మధ్యలో ఉభయ గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్.టీ.ఆర్., పల్నాడు, బాపట్ల, కొనసీమ జిల్లాల్లో అక్కడక్కడ నేడు సాయంకాలం సమయంలో వర్షాలను చూడగలము. కానీ నేడు తప్పిన ప్రదేశాల్లో రేపు, అలాగే జూలై 5 న ఖచ్చితంగా వర్షాలు నమోదవ్వనుంది. నేడు ఇంకా పూర్తిగా అల్పపీడనం ప్రభావం ఉండదు కాబట్టి నిన్నటిలాగానే అక్కడక్కడకు మాత్రమే పరిమితం అవుతుంది. నేడు సాయంకాలం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ సాయంకాలం వర్షాలుంటాయి. విశాఖలోని నగర శివారు ప్రాంతాలైన అనకాపల్లి - గోపాలపట్నం - పెందుర్తి వైపు వర్షాలు పడే అవకాశాలు నేడు కనిపిస్తున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.