ఎక్కడైతే చంద్రయాన్ 2 ఆగిపోయింది సరిగ్గా అక్కడ నుంచే చంద్రయాన్ 3 జర్నీ మొదలు కాబోతుంది. ఇస్రో చీఫ్ సోమనాథ్ చంద్రయాన్ 3 డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జులై 13 న ఫస్ట్ డేట్ గా చెప్పిన ఇస్రో అప్పటి నుంచి 19వరకూ సరైన టైమ్ చూసి చంద్రయాన్ 3 ని ప్రయోగిస్తామని స్పష్టం చేసింది.
మీకు గుర్తుండే ఉంటుంది చంద్రయాన్ 2 ఎక్కడ ఆగిపోయింది. చంద్రయాన్ 2 పనేంటంటే చంద్రుడి మీదకు ఇప్పటివరకూ ఎలాంటి ప్రయోగం జరగని చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్ ను దింపి రోవర్ ను నడిపించాలని ప్లాన్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు చంద్రయాన్ 2 రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. ఇలా విజువల్స్ లో చూపించాలని ప్రశాంతంగా దిగాల్సిన ల్యాండర్ అనుకోని అవాంతరాలతో చంద్రుడిపైన కూలిపోయింది. మన ఇస్రో అప్పటి ఛైర్మన్ శివన్ అయితే చెప్పలేని వేదన అనుభవించారు. చంద్రయాన్ 2 ఆయన కలల ప్రాజెక్ట్. అందుకే శివన్ ను అప్పుడు ప్రధాని మోదీ ఓదారుస్తుంటే చంటిపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పని నేను చేస్తానంటూ చంద్రయాన్ 3 బయల్దేరుతుంది. సేమ్ ప్రాసెస్ ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్ కావాలి అంతే. అప్పడు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ రోవర్ అని పేర్లు కూడా పెట్టారు. అప్పుడు కాని ఆ ప్రయోగాన్ని మళ్లీ ప్రయత్నిస్తున్నారు. విజయమో వీర స్వర్గమో అన్నట్లే. సైన్స్ కి ఓటమి ఉండదు. కామాలే తప్ప, ఫుల్ స్టాప్ ఉండదు. చంద్రయాన్ 3తో మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ఓ రోవర్ ను చంద్రుడి దక్షిణ ధృవం పైన చీకట్లోనే ఉంటూ మనిషికి కంటికి కనపడని ఆ వైపు ఏముందో తెలుసుకోవాలనేది ఇప్పుడు ఇస్రో ముందున్న టార్గెట్.