Morning Top News:
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జీడిమెట్లలో మంగళవారం సాయంత్రం చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దూలపల్లి రోడ్డులో ఉండే ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మొత్తం మూడు ఫ్లోర్లు ఉండే ఈ భవనంలోని కింది అంతస్తులో మొదట మంటలు వచ్చాయి. మూడు ఫ్లోర్లకు అంటుకున్నాయి. ఇప్పుడు వాటిని ఆర్పేందుకు 20 గంటలకుపైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జగన్-షర్మిల సవాల్... చంద్రబాబు మౌనం
అమెరికాలో గౌతం అదానీపై నమోదు అయిన కేసు ఏపీ రాజకీయాల్లో హైలెట్ అవుతోంది. జగన్.. అదానీ నుంచి రూ.1750 కోట్లు లంచం పుచ్చుకున్నారని అక్కడి పత్రాల్లో ఉండటమే. విచిత్రంగా ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా ఒకటే డిమాండ్ చేస్తోంది. దమ్ముంటే విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని వైసీపీ సవాల్ చేస్తోంది. ఆసక్తికరంగా షర్మిల కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఒప్పందాలను రద్దు చేయాలని అంటున్నారు. అయితే దీనిపై చంద్రబాబు మౌనం వహిస్తున్నారు. ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేస్తే పెట్టుబడుల పరంగా ఏపీకి బ్యాడ్ ఇమేజ్ వస్తుందని
చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజ్యసభకు నాగబాబు..!
ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. మరో ఇద్దరు ఇంకా ఏ పార్టీలో చేరలేదు. అంటే ఈ ముగ్గురూ మళ్లీ రాజ్యసభ పదవులకు పోటీ చేసే అవకాశాలు లేనట్లే. మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి జనసేనకు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చు.
జనసేన పార్టీ తరపున నాగేంద్రబాబును ఎంపీగా పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన రెండు స్థానాల్లో
టీడీపీ అభ్యర్థులు రాజ్యసభకు వెళ్లనున్నారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్..?
తెలంగాణలో కాంగ్రెస్ -
బీఆర్ఎస్ పార్టీల మధ్య రోజు రోజుకు పొలిటికల్ వార్ తీవ్రమవుతోంది. రేవంత్ రెడ్డి పాలనపైన, ఇచ్చిన హమీల అమలు, హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత, ఇళ్లు కూలిన బాధితుల విషయాలు, లగచర్ల అల్లర్ల ఘటన వంటి అంశాలపై ఇప్పటికే బీఆర్ఎస్ దూకుడుగా వెళుతోంది. రేవంత్ కూడా బీఆర్ఎస్ మాటల దాడికి ప్రతి దాడి చేస్తూనే ఉన్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత కాంగ్రెస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు సిద్ధమవుతుందా అన్న చర్చ సాగుతోంది. త్వరలో బీఆర్‌ఎస్ నుంచి నేతలను కాంగ్రెస్ చేర్చుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ, ఆయన కంపెనీ సహచరులపై అమెరికాలో కేసు నమోదు కావడం ఏపీలో దుమారం రేపుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు అనుచిత లబ్ది చేకూర్చినందుకు గాను మాజీ సీఎం జగన్ మోహనరెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఏపీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద మాజీ సీఎం
జగన్‌తో పాటు, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, గౌతమ్ అదానీపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు.
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
CID రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్టు
CID విశ్రాంత అదనపు SP విజయ్ పాల్ అరెస్టు అయ్యారు. విచారణ అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. YCP హయాంలో ఓ కేసు విచారణలో ప్రస్తుత ఉండి MLA రఘురామను హింసించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా నిరాకరించిన విషయం తెలిసిందే.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దూసుకొస్తున్న పెంగల్ తుపాను
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇదివరకే తీవ్ర వాయుగుండంగా మారింది. నేడు వాయుగుండం ఫెంగల్ తుపానుగా ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ బుధవారం తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో 27న ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. అయితే నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర సీఎం పీఠంపై పంచాయితీ ఎట్టకేళకు ఒక కొలిక్కి వచ్చింది. నాలుగు రోజులుగా ఎడతెగని చర్చలు ముగిసాయి. ఢిల్లీలో చర్చల అనంతరం ఈ రేసు నుంచి ఏక్‌నాథ్ షిండే తప్పుకున్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంతే కాకుండా రెండు మూడు రోజుల్లోనే ప్రమాణ స్వీకారానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఏక్‌నాథ్ షిండేను కేంద్రమంత్రిగా పంపిస్తారని కూడా మహారాష్ట్రలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హీరో అక్కినేని అఖిల్ పెళ్లి
అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జైనాబ్ రవద్ధితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. కాగా, నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి డిసెంబర్ లో జరగనున్న విషయం తెలిసిందే. అఖిల్‌కు కాబోయే భార్య జైనబ్ కూడా ఓ ఆర్టిస్టే. ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అఖిల్-జైనబ్ మధ్య రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్‌షిప్‌గా మారిందని సమాచారం.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి