Satyabhama Serial Today Episode క్రిష్ జరుగుతున్న విషయం గురించి ఆలోచిస్తుంటే సత్య అక్కడికి వెళ్తుంది. తండ్రి పరువు పోయే పరిస్థితి వచ్చిందని రాజీ పడే పనే లేదని ఎమ్మెల్యే టికెట్ కోసం అవసరం అయితే ప్రపంచం తల కిందులైనా చేస్తానని అంటాడు. గంగ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అంటాడు.
సత్య: పోలీసుల కంటే మీరే బలవంతులు అనుకుంటారు కదా మరి ఇప్పుడెందుకు కంప్లైంట్ ఇస్తా అంటున్నావ్.
క్రిష్: ఎలక్షన్ టైం కదా మీడియా ముందు దురుసుగా పోకుండా కంట్రోల్‌గా ఉండమని నువ్వు చెప్పావు కదా. వాళ్లు అయితే గంగని అరెస్ట్ చేసి సెల్లో పెట్టి నాలుగు ఉతికితే నిజాలు బయటకు వస్తాయి.
సత్య: ఇప్పుడు గంగ ఒంటరిది కాదు చుట్టూ ప్రజలున్నారు. గంగ మీద లాఠీ పడితే మీ నాన్న పరువు పోతుంది. అయినా కోర్టు అయినా పోలీసులు ఎవరైనా సరే డీఎన్ఏ టెస్ట్ చేయమని అంటారు.
క్రిష్: ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారు ఇలాంటి టైంలో ఇలాంటి పనులు చేయకూడదు.
సత్య క్రిష్‌ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇక భైరవి కిచెన్‌లో కూర్చొని బాధ పడుతుంది. అక్కడికి రేణుక వెళ్లి బాధ పడు అత్త నా పరిస్థితే నీకు వచ్చింది నా భర్తకి మామకి వచ్చాయని అంటుంది. నాచుగ్గా లేరని మన భర్తలు మనల్ని వదిలేస్తున్నారని అంటుంది. అయినా భైరవి తన భర్త అలాంటోడు కాదు ఇలాంటోడు కాదు అంటుంది. రేణుక తన భర్తని మామని పోల్చి చెప్తుంది. ఇక భైరవి పక్కనే రేణుక కూర్చొంటే ఏంటే అత్త అని లేకుండా కష్టంలో చుట్టరికం కలుపుతున్నావా అంటే ఈ పరిస్థితిలో ఇక అత్త ఎవరు కోడలు ఎవరు అని రేణుక చురకలేస్తుంది. డీఎన్ఏ రిపోర్ట్ వస్తే మీరు నా గదిలోకి రావాలి గంగ మీ గదిలోకి షిఫ్ట్ కావాల్సిందే అని అంటుంది. దాంతో భైరవి రేణుకని పంపేస్తుంది. ఇక పంకజం వచ్చి పెద్ద కోడలి మాటలు చేదుగా ఉన్నాయి కానీ అవే నిజాలని చెప్తుంది.
మరోవైపు గంగకి సపోర్ట్‌గా మహిళా సంఘాలు వచ్చి గోల చేస్తారు. మహదేవయ్యని గంగ బ్లాక్ మెయిల్ చేస్తుందని ఎవరూ తన కొడుకు ఇక్కడ లేరని క్రిష్ అంటే గంగ మనిద్దరిదీ పేగు బంధం అని అది ఇదీ అని డ్రామా చేస్తుంది. తన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు చేతులు జోడించి దండం పెడతా వెళ్లిపో అని క్రష్ అంటే నేను నీకు దండం పెడతా అని గంగ అంటుంది. వెళ్లిపో అమ్మ అని క్రిష్ అంటే నన్ను అమ్మా అన్నావు అని గంగ నటిస్తుంది. ఇక నర్శింహ ఎవరి బిడ్డనో తీసుకొచ్చి నీ బిడ్డ అంటున్నావ్ సిగ్గు లేదా అని మహదేవయ్యని అడుగుతాడు. ఆయన నా తండ్రి కాకపోతే ఈయనే ఎందుకు పచ్చబొట్టు పొడిపించుకున్నారని క్రిష్ అంటే లోకంలో ఇంత మంది తండ్రులు ఉంటే మీ నాన్నే ఎందుకు పచ్చ బొట్టు పొడిపించుకున్నాడు అని అడుగుతాడు. ఏదో ఒకరోజు మీ నాన్నకి మన గురించి తెలిసే ఇలా పచ్చబొట్టు వేసుకున్నాడని అంటుంది. ఇక క్రిష్ నన్ను నా బాపుని విడదీయాలని చూస్తావా చంపేస్తా అని అంటాడు.
అందరూ క్రిష్‌ని గంగతో పంపాలని అంటే దానికి మహదేవయ్య చిన్నా గంగ కొడుకు అని తేలితే పంపేస్తా అంటాడు. క్రిష్‌ని గంగకి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తానని మహదేవయ్య అంటాడు. దానికి గంగ ఒక కండీషన్ ఉందని క్రిష్‌ని నేను నా కొడుకు అంటున్నా నువ్వు నీ కొడుకు అంటున్నావ్ కదా అందుకు నేను నువ్వు క్రిష్ ముగ్గురం డీఎన్ఏ టెస్ట్ చేయించుకుందామని అంటుంది. తాను డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే క్రిష్ తన కొడుకు కాదని తెలిసిపోతుందని మహదేవయ్య టెన్షన్ పడతాడు. అందరూ క్రిష్ మహదేవయ్య కొడుకే టెస్ట్ చేసుకుంటాడని అంటుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.