Akkineni Akhil is engaged to Zainab who is 9 years older: అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ రెండో సారి ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మెదటి ఎంగేజ్ మెంట్  పెళ్లి వరకూ వెళ్లలేదు. ఇప్పుడు రెండో సారి ఎంగేజ్ మెంట్ జరిగినట్లుగా ప్రకటించారు. అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు  జైనాబ్ రావడ్జీ. ఈమె వయసు 39 సంవత్సరాలు. అఖిల్ వయసు ముఫ్పై ఏళ్లు మాత్రమే. అంటే అఖిల్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద. పెళ్లి ఎప్పుడు చేయాలో ఇంకా నిర్ణయించలేదని అక్కినేని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 


అక్కినేని అఖిల్ గతంలో నాగ చైతన్య, సమంత వివాహం జరిగేటప్పుడు ఓ సారి నిశ్చితార్థం చేసుకున్నారు. తన కన్నా వయసులో ఏడేళ్లు పెద్ద అయిన శ్రీయాభూపాల్ అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత ఏమయిందో కానీ పెళ్లి కాన్సిల్  చేసుకున్నారు. తర్వాత నాగ చైతన్య, సమంత పెళ్లి అయింది. కానీ వారు కూడా విడిపోయారు. ఇప్పుడు నాగ చైతన్య, శోభితా దూళిపాళ్లతో మరోసారి వివాహ బంధం అడుగుతున్న పెడుతున్న సమయంలో అఖిల్ మరోసారి ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ సారి తన జోడి వయసు తన కన్నా ఏకంగా తొమ్మిదేళ్లు పెద్ద.                   


Also Read:  ఎంగేజ్​మెంట్ చేసుకున్న అక్కినేని అఖిల్.. జైనాబ్​ రవ్​జీని చిన్న కోడలంటూ పరిచయం చేసిన నాగార్జున


జైనాబ్ పెయింటర్ అని చెబుతున్నారు. ఆమె వ్యక్తిగత విషయాలు బయటకు రాలేదు. గతంలో మ్యారేజ్ అయి డైవోర్స్ తీసుకున్నారన్న ప్రచారం ఉంది. ఇది నిజమో కాదో తెలియదు. జైనాబ్ తండ్రి మాత్రం నాగార్జునకు సన్నిహితుడు..స్నేహితుడు.. వ్యాపార భాగస్వామిగా చెబుతున్నారు.  జుల్ఫీ రావడ్జీ కుటుంబానికి ZR ఇన్ ఫ్రా పేరుతో  కంపెనీ ఉంది. ఆయనను సీఎంగా ఉన్నప్పుడు జగన్ 2020 మార్చిలో  కేబినెట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ర్యాంక్  గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిదిగా నియమించారు.         


       


Also Read: అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే


అంటే ఈ జుల్ఫీ రావడ్జీ కుటుంబానికి ఏపీ రాజకీయాలతో పాటు నాగార్జునకు కూడా సన్నిహితులు అని అనుకోవచ్చు. వ్యాపార పరంగా నాగార్జునతో పాటు నిమ్మగడ్డ  ప్రసాద్ మరికొందరు భాగస్వాములని అందులో  అఖిల్‌కు కాబోయే భార్య కుటుంబం కూడా ఉన్నారని భావిస్తున్నారు.  జల్ఫీ రావడ్జీ కుటుంబానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ లోనూ వీరికి వ్యాపారాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తెలుగు కాకపోవచ్చు .. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కాకపోవచ్చు కానీ తండ్రి వ్యాపార భాగస్వాములు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ .