Who is Zainab Ravdjee: అక్కినేని కుటుబంంలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయిపోయింది. ఆ అమ్మాయి పేరు  జైనాబ్ రావడ్జీ అని ప్రకటించారు. అయితే ఆమె గురించి అంతకు మించిన వివరాలు లేవు. ఆమె హీరోయిన్ కాదు. అంతకు మించి తెలుగువారు కూడా కాదు. కానీ హైదరాబాదీలే. అయితే ఆ కుటుంబానికి రాజకీయ, వ్యాపార లింకులు ఉన్నాయి.  జైనాబ్ రావడ్జీ తండ్రి జుల్ఫీ  రావడ్జీ ఏపీ ప్రభుత్వంలో జగన్ సలహాదారుగా పని చేశారు. కేబినెట్ ర్యాంక్‌తో ఆయన కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. 


జుల్ఫీ రావడ్జీ కుటుంబానికి ZR ఇన్ ఫ్రా పేరుతో  కంపెనీ ఉంది. ఆయనను సీఎంగా ఉన్నప్పుడు జగన్ 2020 మార్చిలో  కేబినెట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ర్యాంక్  గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిదిగా నియమించారు. ఆ జీవోలో ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసిగా పేర్కొన్నారు. అరబ్ దేశాల్లో మంచి పలుకుబడి ఉన్న కుటుంబంగా భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి గతంలో బాక్సైట్ సమస్లు వచ్చాయి. అన్‌రాక్‌, ఏపీఎండీసీ మధ్య బాక్సైట్‌ సరఫరా వివాదం అంతర్జాతీయ కోర్టులో ఉంది. ఈ వివాద పరిష్కారానికి జగన్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అందులో జుల్ఫీ రావ్జీ అనే వ్యక్తికి కూడా చోటు కల్పించింది.  జుల్ఫీ కి సహాయకారిగా ఉండేలా అప్పటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు.  



అంటే ఈ జుల్ఫీ రావడ్జీ కుటుంబానికి ఏపీ రాజకీయాలతో పాటు నాగార్జునకు కూడా సన్నిహితులు అని అనుకోవచ్చు. వ్యాపార పరంగా నాగార్జునతో పాటు నిమ్మగడ్డ  ప్రసాద్ మరికొందరు భాగస్వాములని అందులో  అఖిల్‌కు కాబోయే భార్య కుటుంబం కూడా ఉన్నారని భావిస్తున్నారు. అలా ఏర్పడిన వీరి పరచయం పెళ్లికి దారి తీసిందని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జుల్ఫీని ప్రత్యేక ప్రతినిధిగా నియమించినప్పుడు ఆయనెవరో అందరూ ఆశ్చర్యపోయారు.   


Also Read:  ఎంగేజ్​మెంట్ చేసుకున్న అక్కినేని అఖిల్.. జైనాబ్​ రవ్​జీని చిన్న కోడలంటూ పరిచయం చేసిన నాగార్జున


జల్ఫీ రావడ్జీ కుటుంబానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ లోనూ వీరికి వ్యాపారాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తెలుగు కాకపోవచ్చు .. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కాకపోవచ్చు కానీ తండ్రి వ్యాపారభాగస్వాములు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు.  జైనాబ్ రావడ్జీ పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరింత డీటైల్స్  బయటకు వచ్చే అవకాశం ఉంది.