ఇప్పుడు 'పుష్ప 2' (Pushpa 2 The Rule) ముందున్న టార్గెట్ ఒక్కటే... రాజమౌళి సినిమా రికార్డులు బీట్ చెయ్యడం. ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు తీసిన 'బాహుబలి' రెండు పార్ట్స్, ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తీసిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' నేషనల్ వైడ్ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. అలాగే, ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్', 'సలార్' కూడా! మరి, ఆ సినిమాల రికార్డ్స్ బ్రేక్ అవుతాయా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. అయితే... రాజమౌళిని టార్గెట్ గా పెట్టుకుని సుకుమార్ సినిమా తీశారట. 


మాస్ డోస్ పెంచిన లెక్కల మాస్టరు
Pushpa 2 Telugu First Review: నవంబర్ 25తో పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల నుంచి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం... ప్రశాంత్ నీల్, రాజమౌళిలను టార్గెట్ గా పెట్టుకుని లెక్కల మాస్టారు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ సినిమా తీశారట.


'పుష్ప: ది రైజ్' విడుదలైనప్పుడు ఆడియన్స్ ఎంతో మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లెక్కలు వేసుకుని ఫైట్స్ తీసే సుక్కు తీసిన సినిమాయేనా ఇది? అని అనుకున్నారు. కట్ చేస్తే... ఇప్పుడు 'పుష్ప 2'లో ఆ మాస్ డోస్ మరింత పెంచారని తెలుస్తోంది.


'పుష్ప 2'లో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందని, ఎమోషనల్ పార్ట్ తక్కువ ఉంటుందని తెలిసింది. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టే సుకుమార్ ఆ యాక్షన్ సీన్లు తీశారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమాలో ఐదు నుంచి ఎనిమిది యాక్షన్ సీక్వెన్సులు ఉండే అవకాశం ఉందట. సెకండాఫ్ లాక్ చూశాక, ఫైనల్ కట్ బట్టి కొన్ని యాక్షన్ పార్ట్స్ చిన్నవి చేయొచ్చు. 


జాతర ఎపిసోడ్ వచ్చినప్పుడు పూనకాలే
చిత్తూరు పరిసర జిల్లాలోని ప్రాంతాల్లో జరిపే గంగమ్మ జాతర నేపథ్యంలో 'పుష్ప 2'లో కొన్ని సీన్లు తీశారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, అల్లు అర్జున్ శారీ లుక్ ఆ గంగమ్మ జాతరలో సీన్లే. ఆ జాతర నేపథ్యంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని, అది వచ్చినప్పుడు థియేటర్లలో జనాలు పూనకాలతో ఊగిపోవడం గ్యారెంటీ అని టాక్. 'పుష్ప 2'లో యాక్షన్ బ్లాక్స్ చూస్తే సుకుమార్ 2.ఓ అని ఆడియన్స్ అంటరాని, ఆ లెవల్ ఉన్నాయని టాక్.


Also Readటీలో బిస్కెట్లు ముంచడం మంచిదేనా? బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?


రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సీన్లు జస్ట్ యాక్షన్ అన్నట్టు ఉండవు. ఆ యాక్షన్ వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. సుకుమార్ సినిమాల్లో ఎమోషన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మరి, ఆ యాక్షన్ అండ్ ఎమోషన్ మధ్య బ్యాలన్స్ ఎలా చేశారో చూడాలి. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన 'పుష్ప 2' సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగపతి బాబు, జగత్ ప్రతాప్ బండారి, రావు రమేష్, ధనుంజయ తదితరులు ప్రధాన తారాగణం. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పాటలు ఆయన చేశారు. నేపథ్య సంగీతం కోసం తమన్, సామ్ సిఎస్, అజనీష్ లోక్‌నాథ్ వచ్చాయని తెలుస్తోంది. ఆ విషయం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


Also Read: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే?