Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే

Salman Khan : మహేష్ సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారంటూ తాజాగా బిగ్ బాస్ 18 వేదికగా సల్మాన్ కామెంట్స్ చేశారు. మరి ఆయన కామెంట్స్ కు సూపర్ స్టార్ మరదలు ఏమందంటే?

Continues below advertisement

Salman Khan Comments on Mahesh Babu : ఇండియాలోనే పాపులర్ బుల్లితెర షోలలో బిగ్ బాస్ ముందు వరసలో ఉంటుంది. ఇక అందులో హోస్ట్ గా వ్యవహరించే వారికి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగులో చాలా కాలం నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతుండగా, హిందీ బిగ్ బాస్ కు కూడా చాలా సీజన్ల నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం హిందీలో నడుస్తున్న తాజా సీజన్ బిగ్ బాస్ షోలో మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కంటెస్టెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే హోస్ట్ సల్మాన్ ఖాన్ 'మహేష్ బాబు సినిమాల్లో ఒకలా ఉంటారు... రియల్ లైఫ్ లో మరోలా ఉంటారు' అంటూ ఆమెతోపాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి క్లాస్ తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Continues below advertisement

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మార్మోగుతుంది. దానికి జక్కన్నతో ఆయన చేయబోయే సినిమా ఒక కారణం అయితే, తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు పేరు వినిపించడం కూడా మరో కారణం. మరి సల్మాన్ ఖాన్ మహేష్ బాబు పేరును ఎందుకు ప్రస్తావించాడు అంటే... ఆయన హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 18 లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కంటెస్టెంట్ గా పాల్గొనడమే రీజన్. హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 ప్రసారమవుతుండగా, రీసెంట్ గా ఓ ఎపిసోడ్ లో శిల్పా శిరోద్కర్ తో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ మహేష్ బాబు ప్రస్తావన తెచ్చారు. 

"శిల్పా మీ బావ మహేష్ బాబు... స్క్రీన్ మీద యాక్షన్, ఆటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో కనిపిస్తారు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం ఆయన ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్. చాలా సింపుల్ గా ఉంటాడు" అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇదంతా ఎందుకంటే... మహేష్ బాబును ఉదాహరణగా చూపి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి జీవిత పాఠాలు చెప్పారు సల్మాన్ ఖాన్. ఇక షోలో మహేష్ బాబు ప్రస్తావన రావడంతో ఆయన మరదలు శిల్పా సంతోషంతో చూస్తూ, సల్మాన్ ఖాన్ చెప్పే మాటలు వింటూ ఉండిపోయింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా శిల్పా శిరోద్కర్ గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. రీఎంట్రీలో పలు టీవీ షోలలో కనిపించింది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ షోలో  కంటెస్టెంట్ అన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు మహేష్ బాబు జక్కన్న తో కలిసి 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్ సీజన్ 18'కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే, 'సికందర్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.  

Read Also :  బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?

Continues below advertisement
Sponsored Links by Taboola