Siddharth Comments on Allu Arjun Pushpa 2 : ఏ ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్టాడతారు హీరో సిద్ధార్థ్. చాలా సార్లు కేర్ ఆప్ కాంట్రవర్శీగా మారారు కూడా. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మిస్ యూ’. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఆషికా రంగనాథ్ హీరోయిన్గా చేస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా.. నిర్వహించిన ప్రెస్ మీట్లో ‘‘పుష్ప 2 డిసెంబర్ లో తెలుగు, తమిళంలో కూడా విడుదల అవుతోంది. ఈ సమయంలో మీ సినిమాను ఎందుకు విడుదల చేస్తున్నారు? అనే ప్రశ్నకు సిద్ధార్థ్ స్పందిస్తూ, ‘‘నేను పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కంట్రోల్ లో లేని విషయాల గురించి నేను మాట్లాడను. రెండో వారంలో కూడా థియేటర్లలో నా సినిమా ఉండాలంటే ముందు ప్రేక్షకులకు నచ్చాలి. బాగుండాలి. నా సినిమా బాగుంటే థియేటర్ల లోంచి ఎవరూ తీయలేరు. ప్రతి సినిమా పెద్ద సినిమానే . ఆ బడ్జెట్ లు ఆ సినిమా పెద్దదా? చిన్నదా? అనే విషయాన్ని నిర్ణయించకూడదు’’ అన్నారు సిద్ధార్థ్.
ప్రేమకథలకు చేయకూడదని నిర్ణయించుకున్నా
‘‘ ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా తర్వాత ప్రేమ కథల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలోని సిద్ధార్థ్ వేరు. ఇప్పడు కనిపిస్తున్న సిద్ధార్థ్ వేరు. చాలా మారాను. నేను చనిపోతే, అరె ఓ మంచి నటుడు లేడే అని అందరూ బాధపడాలి. అందుకే ప్రేమకథలను ఒప్పుకోలేదు. తర్వాత నిర్మాతగా జోనర్స్ సినిమాలను టచ్ చేశాను. ‘చిన్నా’ సినిమాకు క్రిటికల్ ఎక్లయిమ్స్ వచ్చాయి. కానీ వసూళ్లు తెప్పించడానికి మానసికంగా చాలా నలిగిపోయాను. ఆ సమయంలోనే దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. ప్రపంచంలో ఏ వ్యక్తి తన నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడు. అదే సినిమాలోని కొత్త పాయింట్ . ఈ మూవీ నచ్చితే కొత్త ప్రేమకథల ట్రెండ్ వస్తుంది ’’ అని చెప్పారు సిద్ధార్థ్.
Also Read: టీలో బిస్కెట్లు ముంచడం మంచిదేనా? బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?
నేను తెలంగాణ అల్లుడిని..
కథానాయిక అదితీ రావ్ హైదరీ తో ఆయన వివాహమైన సంగతి తెలిసిందే. తన మ్యారేజ్ లైఫ్ గురించి కూడా షేర్ చేసుకున్నారు. ‘‘అదితి రూపంలో నా జీవితంలోకి ఓ దేవత వచ్చింది. 2024 లో నా జీవితంలో ఏదైనా మంచి విషయం జరిగిందీ అంటే అది అదితీతో వివాహమే. నా లైఫ్ ను పూర్తిగా మార్చేసింది. తన వల్ల నేను తెలంగాణ అల్లుడ్ని అయ్యాను’’ అన్నారాయన.
అదితీ సినీ కెరీర్
తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకుల దగ్గరైన అదితీ రావ్ హైదరీ అదితీ తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్ సంస్థానానికి చెందిన వారు. 2006 నుంచి పలు హిందీ, తమిళ, మలయాళ చిత్రాలలో నటించడం మొదలుపెట్టారు అదితి. ‘చెలియా’ అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. భరతనాట్య కళాకారిణిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అదితీ రావ్ హైదరీ ‘సమ్మోహనం’, ‘మహా సముద్రం’ చిత్రాల ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్రేమ టూ పెళ్లి
‘మహాసముద్రం’ సమయంలోనే జంటగా నటించిన సిద్ధార్థ్, అదితీలు ఆ సినిమా సమయంలో మొదలైన తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకొచ్చారు. ‘హీరామండీ’ అనే వెబ్ సిరీస్ లో కనిపించి, తన నటనతో మెప్పించారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘గాంధీ టాక్స్ ’ అనే మూకీ సినిమా లోనూ ఆమె నటించారు. ‘లయనెస్’ అనే ఆంగ్ల చిత్రంలోనూ కనిపించారు. ఇక సిద్ధార్థ్ త్వరలో ‘ఇండియన్ 3’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.