Devi Sri Prasad Sensational Speech At Pushpa 2 Chennai Event: ''మనకు ఏం కావాలన్నా అది అడిగి తీసుకోవాఐ. నిర్మాత దగ్గర పేమెంట్ అయినా సరే స్క్రీన్ మీద పేరు అయినా సరే'' అని టాప్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అన్నారు‌. ఈ రోజు చెన్నైలో జరిగిన పుష్ప ది రూల్ ఈవెంట్లో ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిర్మాతలతో తనకు ఉన్న సమస్య గురించి స్టేజ్ మీద చెప్పేశారు. 


మైత్రి రవి గారికి ప్రేమ కంటే ఫిర్యాదులు ఎక్కువ! - డీఎస్పీ
'పుష్ప ది రూల్' సంగీతం విషయంలో గొడవలు జరిగాయనే విషయం బయటకు వచ్చింది. అల్లు అర్జున్, చిత్ర దర్శకుడు క్రియేటివ్ జీనియస్ సుకుమార్, ‌ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మధ్య మంచి స్నేహం ఉంది. వాళ్ల కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్. ఈ తరుణంలో దేవి శ్రీని తప్పించి మరొక సంగీత దర్శకుడిని నేపథ్య సంగీతం అందించడం కోసం ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. నిర్మాత ఒత్తిడి వల్లే మరొక 'పుష్ప 2 ది రూల్' చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందించడానికి వచ్చారనేది అర్థం అవుతోంది. అసలు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టేజి మీద దేవి శ్రీ ప్రసాద్ ఏం అన్నారు? అనే వివరాల్లోకి వెళితే...


Also Readపుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?


''రవి సార్... నన్ను 'స్టేజి ఎక్కి ఎక్కువ సేపు మాట్లాడావ్' అనొద్దు. నేను టైమ్‌కు పాట ఇవ్వలేదు, టైమ్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైమ్‌కు ప్రోగ్రాంకి రాలేదు అనొద్దు. నా మీద రవి గారికి చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ, నా మీద ఆయనకు ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. అది ఏమిటో అర్థం కాదు'' అని దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడారు. 'పుష్ప ‌2' సినిమా నేపథ్య సంగీతం విషయంలో నిర్మాతలతో ఆయనకు సమస్య తలెత్తిందని ఆ మాటలు బట్టి తెలుస్తోంది. 


స్టేజ్ మీద అడిగితేనే కిక్...
నేను ఎప్పుడూ ఇంతే... చాలా ఓపెన్!
'పుష్ప 2' నేపథ్య సంగీతం విషయంలో తెర వెనుక ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలని చాలా మందిలో ఉంది. దేవి శ్రీ ప్రసాద్ స్పీచ్ వాళ్ళందరి అనుమానాలకు సమాధానం ఇచ్చిందని చెప్పాలి. ఈ విషయాలు సపరేటుగా అడగొచ్చు అని ఈ విధంగా స్టేషన్ మీద అడిగితేనే బావుంటుందని తాను ఓపెన్ అని రాక్ స్టార్ కామెంట్ చేశారు.


''నేను ఈ 25 నిమిషాల క్రితం వచ్చాను. కెమెరా ఎంట్రీ అని చెప్పి ఆపేశారు. కిస్సిక్ సాంగ్ వస్తుంటే పరిగెత్తుకుని వచ్చాను. స్టేజి మీద ఉన్నప్పుడే నేను సిగ్గు లేకుండా ఉంటాను. స్టేజి దిగితే నాకు మహా సిగ్గు. నేను వచ్చిన వెంటనే రవి గారు 'రాంగ్ టైమింగ్ సార్! లేట్' అన్నారు. ఇవన్నీ సపరేట్ అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా అడిగితేనే కిక్. నేను ఎప్పుడూ అంతే ఓపెన్. సో... నేను ఎప్పుడూ ఆన్ టైమింగ్'' అని దేవి‌ శ్రీ ప్రసాద్ మాట్లాడారు ఇప్పుడు ఆయన మాటల మీద నిర్మాత రవిశంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి. పబ్లిక్ ఫోరంలో పుష్ప 2 రచ్చ తీసుకువచ్చి పెట్టేసారు దేవిశ్రీ. ఇప్పుడు ఆయన మీద నిర్మాతలు వ్యతిరేకంగా మాట్లాడతారా? లేదంటే తమ మధ్య చిన్న చిన్న గొడవలు మాత్రమే ఉన్నాయని అంగీకరిస్తారా? వెయిట్ అండ్ సీ. 


Also Readకృష్ణ కృష్ణా... 'గల్లా'పెట్టెలో డబ్బు గల్లంతు - ప్రశాంత్ వర్మకు, ‌బుర్రాకు అంత ఇవ్వడం వర్తేనా?