'ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా!' అని 'పుష్ప: ది రైజ్' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాట పాడారు. దాన్ని కొంచెం మార్చి 'ఏయ్ బిడ్డా... తెలంగాణ నా అడ్డా' అని అభిమానులు కొత్త పాట రాయవచ్చు. ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే... మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో లేనట్టుగా భారీ ఎత్తున 'పుష్ప 2: ది రూల్' విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


త్రిబుల్ ఆర్, కల్కి కంటే ఎక్కువ థియేటర్లలో...
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా తెలంగాణలో 440 థియేటర్లలో విడుదల అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' కూడా నైజాంలో 500 థియేటర్లలోపే రిలీజ్ చేశారు. ఆ రెండు సినిమాల కంటే ఎక్కువ స్క్రీన్ లలో అల్లు అర్జున్ సినిమా విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.


తెలుగు సినిమాకు వచ్చే కలెక్షన్లలో సింహ భాగం నైజాం నుంచి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్మోస్ట్ 50% షేర్ తెలంగాణ నుంచి వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ ఏరియా మీద కన్నేశారు. 550 నుంచి 600 స్క్రీన్ ల వరకు 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదల చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 5న ఇండియాలో, డిసెంబర్ 4లో అమెరికాలో విడుదల చేస్తున్నారు. ఇండియాలో మొదటి షో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మైంటైన్ చేస్తున్న బాలా నగర్ విమల్ థియేటర్లో 'పుష్ప 2: ది రూల్' మొదటి షో పడనుంది. డిసెంబర్ 4వ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు షో పడే అవకాశం ఉంది.


Also Read: 'కర్మ'రా బాబూ... ఇండియన్ సినిమాల్లో తొలి లిప్ లాక్ ఆ సినిమాలోదే - ఆ హీరోయిన్ మన విశాఖ అమ్మాయే అని తెలుసా?


తెలంగాణలో మైత్రి మూవీ మేకర్ సంస్థకు స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. కేవలం తమ సంస్థ నిర్మించే సినిమాలు మాత్రమే కాదు...‌ స్టార్ హీరోల సినిమాల నుంచి డబ్బింగ్ ఫిలిమ్స్ వరకు, చోట మోట హీరోలు నటించే సినిమాల నుంచి హాలీవుడ్ ఫిలిమ్స్ వరకు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. సొంత సినిమాను వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అవుతోంది మైత్రి.


మొదటి రోజు రికార్డులు బద్దలు కావాలి!
'పుష్ప 2 ది రూల్' సినిమా విడుదల చేయబోతున్న స్క్రీన్ కౌంట్లు చూస్తుంటే... మొదటి రోజు ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనబడుతోంది. ఇప్పటి వరకు నాన్ రాజమౌళి రికార్డులు, నాన్ ప్రభాస్ సినిమా రికార్డులు అని ట్రేడ్ వర్గాలు చెప్పడం చూశారు. నాన్ అనే పదం కాదు... పుష్ప జోరు చూస్తుంటే రాజమౌళి సినిమా ఓపెనింగ్ రికార్డులు బద్దలయ్యేలా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. అందుకు తగ్గట్టుగా తమిళ, హిందీ, మలయాళ భాషలతో పాటు బెంగాలీలో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేశారు.


Also Read: ఎవరీ యష్ వీరగోని? బిగ్ బాస్ 8 సోనియా ఆకులకు కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?