Sonia Akula Husband: ఎవరీ యష్ వీరగోని? బిగ్ బాస్ 8 సోనియా ఆకుల పెళ్లి చేసుకునేది ఎవర్ని? అతను ఏం చేస్తాడో తెలుసా?
బిగ్ బాస్ బ్యూటీ, రామ్ గోపాల్ వర్మ 'ఆశా ఎన్కౌంటర్' ఫేమ్ సోనియా ఆకుల జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చాడు. బిగ్ బాస్ ఇంటిలోని చిన్నోడు కాదు, పెద్దోడు కాదు... ఆమె మరొకరిని పెళ్లాడబోతోంది. (Image Courtesy: soniya_akula_official / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతనకు నిశ్చితార్థం జరిగినట్లు సోనియా ఆకుల ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు. తనకు కాబోయే భర్త యష్ వీరగోని అని పరిచయం చేశారు. ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలలో యష్ గురించి చెప్పిన సోనియా... ఇప్పుడు అతనితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంతకీ, ఎవరీ యష్? ఆయనది ఏ ఊరు? అతను ఏం చేస్తాడు? వంటి వివరాల్లోకి వెళితే... (Image Courtesy: soniya_akula_official / Instagram)
యష్ పూర్తి పేరు యష్ పాల్ వీరగోని. ఆయనది వరంగల్. గీసుకొండ నుంచి వరంగల్ వచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీ. ఆయన పేరెంట్స్ పేర్లు బిక్షపతి, అరుణ్ జ్యోతి. పేద కుటుంబంలో జన్మించిన యష్, కష్టపడి చదువుకుని అమెరికా వెళ్లి ఉద్యోగం చేసి వచ్చారు. అమెరికాలో చదువుకు వెళ్లిన రోజుల్లో తనకు ఎదురైన ఇబ్బందులు మరొకరికి ఎదురు కాకూడదని 'ఫ్లయ్ హై' అని ఒక కన్సల్టెన్సీ స్థాపించాడు. (Image Courtesy: soniya_akula_official / Instagram)
యష్ వీరగోనికి క్రికెట్ అంటే ఇష్టం. అండర్ 16, అండర్ 19 మ్యాచులు ఆడాడు. అతనికి కన్సల్టేన్సీ మాత్రమే కాదు... దావత్ పేరుతో అమెరికాలో రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. (Image Courtesy: soniya_akula_official / Instagram)
త్వరలో యష్ పాల్ వీరగోని, సోనియా ఆకుల వివాహం చేసుకోనున్నారు. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుంటారు? వంటి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. (Image Courtesy: soniya_akula_official / Instagram)