Watch Pushpa 2 Item Song Kissik: కిస్ కిస్ కిస్సిక్... అంటూ చిన్న ప్రోమో విడుదల చేసి 'కిస్సిక్' పాట మీద అంచనాలు పెంచేసింది 'పుష్ప 2: ది రూల్' టీం. ఇప్పుడు ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో విడుదల చేసింది. ఆ పాట ఎలా ఉంది? లిరికల్ వీడియోలో ఏం చూపించారు? అనేది చూడండి.
కిస్సిక్... అస్సలు తగ్గేది లే!
టాలీవుడ్ టాప్ డ్యాన్సర్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. హీరోయిన్లలో డ్యాన్సర్ల విషయానికి వస్తే తెలుగు అమ్మాయి శ్రీ లీల (Sreeleela) తప్పకుండా ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయలేదు. గతంలో ఓ యాడ్ చేసిన బన్నీ, శ్రీ లీల... ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' కోసం తొలిసారి కలిసి స్టెప్పులు వేశారు.
'పుష్ప: ది రైజ్' సినిమాలోని స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాట చార్ట్ బస్టర్ కావడంతో 'పుష్ప 2: ది రూల్'లో స్పెషల్ సాంగ్ మీద ముందు నుంచి ప్రెజర్ ఉంది. అది దృష్టిలో పెట్టుకుని దేవి శ్రీ ప్రసాద్ జాగ్రత్తలు చాలా తీసుకున్నారని అర్థం అవుతోంది. 'కిస్సిక్...' ట్యూన్ వింటే ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అని అవుతుందని ఫీలింగ్ కలుగుతోంది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇచ్చిన బాణీకి ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ రాశారు. ఇప్పుడీ 'కిస్సిక్...' కూడా దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ సాంగ్ లిరికల్ వీడియో ఎలా ఉందో మీరూ ఒకసారి చూడండి.
ఒక్క పాట కోసం కోటి తీసుకున్న శ్రీ లీల
Sreeleela Remuneration For Kissik Song: కిస్సిక్ సాంగ్ కోసం శ్రీ లీలకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే... అందులో నిజం లేదు అని టాక్. ఆమెకు కోటి రూపాయలకు అటు ఇటుగా ఇచ్చినట్లు సమాచారం. ఈ అమ్మడు ఫస్ట్ టైమ్ ఐటెం సాంగ్ చేయడం కూడా సినిమాకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మంచి బజ్ తీసుకు వచ్చింది.
Also Read: కృష్ణ కృష్ణా... 'గల్లా'పెట్టెలో డబ్బు గల్లంతు - ప్రశాంత్ వర్మకు, బుర్రాకు అంత ఇవ్వడం వర్తేనా?
అమెరికాలో రికార్డ్ సేల్స్... ఇండియాలో హైప్
అమెరికాలో 'పుష్ప 2: ది రూల్' అడ్వాన్స్డ్ సేల్స్ కొన్ని రోజుల క్రితం ప్రారంభం అయ్యింది. అక్కడ ఆల్రెడీ వన్ మిలియన్ కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ రిలీజుకు మరికొన్ని రోజుల సమయం ఉండటంతో ఎలా లేదన్నా అడ్వాన్స్డ్ సేల్స్ మూడు కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని టాక్. ఇండియాలోనూ ఈ మూవీ మీద విపరీతమైన హైప్ నెలకొంది. మొదటి రోజు భారీ రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల టాక్.