Sookshmadarsini Malayalam Movie Review: హీరో నాని నటించిన‘అంటే సుందరానికి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు నజ్రియా నజిమ్ (Nazriya Nazim).  ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో నజ్రియ తెలుగులోొ మళ్లీ కనిపించలేదు.  భర్త ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) ఇటీవల ‘ఆవేశం’ లాంటి లోకల్ ఫిల్మ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టారు.  తాజాగా ఆయన రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘వేట్టయాన్’ లోనూ ఫహాద్ ఓ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు బన్వర్ సింగ్ షెకావత్ గా ‘పుష్ప 2’ ద్వారా మరో సారి వెండితెర పై  తన విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు.   ఆయన భార్య నజ్రియా ఫహాద్ నటించిన మలయాళ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ (Sookshmadarshini) థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఇక ఈ సినిమాలో మరో మెయిన్ రోల్ చేసిన  మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ రెండేళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులకు ‘జయ జయ జయ జయ హే’ చిత్రంతోొ చేరువయ్యారు. ఆయన దర్శకుడు కూడా. ఆయన తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం ‘మిన్నల్ మురళి’ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ ఏడాది దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘నూనకుళ్లి’ అనే చిత్రంలోనూ కనిపిస్తారు.ఈ చిత్రానికి  ఎం.సి. జితిన్ దర్శకుడు.  కామెడీ పాత్రలతో నవ్వించే బాసిల్ జోసెఫ్ తాజా చిత్రం ఎలా ఉందంటే...


అనుమానించే హౌస్ వైఫ్ పాత్రలో నజ్రియా


ఇరుగు పొరుగు ఇళ్ల  మనుషులు, వారి కథలను తెలుసుకోవాలనే కుతూహలం కలిగి ఉండే సాదా సీదా గృహిణి ప్రియదర్శిని (నజ్రియా). ఆమె పక్క ఇంట్లోకి మాన్యుయల్ (బసిల్ జోసెఫ్) దిగుతాడు. అతని తో పాటు తల్లి గ్రేసీ (మనోహరి జాయ్) కూడా.  ఆమెకి కాస్త అనారోగ్యంగా  ఉందని అందరికీ చెబుతాడు మాన్యుయల్. అయితే అతని ఇంటి పక్కనే ఉండే  ప్రియదర్శినికి అతని కదలికలపై అనుమానం కలుగుతుంది.  అమాయకపు చూపుల మాన్యుయల్ వెనుక ఇంకో మనిషి ఉన్నాడని గుర్తిస్తుంది. ఓసారి అకస్మాత్తుగా మాన్యుయల్ తల్లి కనబడకుండా వెళిపోతుంది.  మళ్లీ దొరుకుతుంది. కనబడకుండా పోయిన సమయంలో ఆ ఇంట్లోనే మాన్యుయల్ తల్లిని చూస్తుంది ప్రియ. తన చుట్టు పక్కల ఉండే వారికి ఈ విషయం చెబుతుంది ప్రియ. అయితే ఎవరూ ఈ విషయాన్ని నమ్మరు. ఆమె అనుమానాలన్నీ అపోహలుగా మిగులుతాయి. ప్రియ అనుమానాలన్నీ నిజమేనా? మిగతా కథేంటో తెలియాలంటే థియేటర్ వెళ్లాల్సిందే.  చాలా సాదా సీదా కథను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను చివరి వరకూ చూడగలిగేలా చేయడంలో దర్శక, రచయితలు సక్సెస్ అయ్యారు.  అతుల్ రామచంద్రన్, లిబిన్.టి.బి రచించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లోని క్లయిమ్యాక్స్ ట్విస్ట్ ఈ చిత్రానికి  హైలైట్.


Also Readనన్ను లేట్ అనొద్దు, నాది ఆన్ టైమ్... పుష్ప 2 మ్యూజిక్ ఇష్యూస్‌ - నిర్మాతపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు


నిర్మాతగా కూడా సక్సెస్


రెండేళ్ల క్రితం ‘జయ జయ జయ జయహే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు మలయాళ నటుడు బసిల్ జోసెఫ్. మొదట దర్శకునిగా వెండితెరకు పరిచయమై ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నారు   ఎమ్.సి. జితిన్ కి ఇది రెండో సినిమా. గతంలో ఆయన ‘నాన్ సెన్స్’ అనే  స్పోర్ట్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా  ఆశించిన విజయం సాధించలేదు. 2020లో భర్త ఫహాద్ తో కలిసి నజ్రియా నటించిన ‘ట్రాన్స్’ అనే చిత్రం ఆమెకి మంచి విజయం తెచ్చిపెట్టింది. ‘భర్త ఫహాద్ తో  కలిసి ఫహాద్ అండ్ ఫ్రెండ్స్ అనే బ్యానర్ పై ‘వరదన్, ‘కుంబలంగి నైట్స్’, సీ యూ సూన్’,  ‘ఆవేశం’ చిత్రాల నిర్మాతగా విజయాలను అందుకున్నారు నజ్రియా.  



Also Readస్టేజి మీద పుష్ప పాటకు డ్యాన్స్ చేసిన అల్లు అర్జున్... వీడియో చూస్తే పూనకాలే... రజనీకాంత్ మేనరిజం బన్నీ చేస్తే... - పుష్ప 2 చెన్నై ఈవెంట్ హైలైట్స్