Top 10 Headlines Today:


 


కేసీఆర్‌పై ఉమ్మడి అభ్యర్థి


తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన ఓటమి భయంతో ఉన్నారని విపక్షాలు ఓ అంచనాకు వచ్చాయి. అటు గజ్వేల్‌లో కానీ ఇటు కామారెడ్డిలో కానీ ఓ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ మాజీ చైర్మన్ కోదండరాం ఈ విషయాన్ని అన్ని పార్టీల ముందు ఉంచారు. కేసీఆర్‌పై ఉమ్మడి అభ్యర్థిని దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారన్నారు. ఆ దిశ‌గా విప‌క్ష పార్టీలు ఆలోచ‌న చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ అంశంపై రాజకీయ  పార్టీలన్నీ ఓ స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఢిల్లీ ఎందుకు వెళ్తున్నట్టు?


ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల గల్లంతుతో పాటు దొంగ ఓట్లను చేర్చిన అంశంపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 28వ తేదన రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ రూపొందించిన రూ. వంద వెండి నాణెన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో కుటుంబసభ్యులందరితో పాల్గొంటారు. ఆ తర్వాత ఈసీని కలుస్తారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో ఉంటూండటంతో రాష్ట్ర రాజకీయాలపై కొన్ని కీలక చర్చలు నిర్వహించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మోస్తరు వర్షాలు


ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 24) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


తెలుగు సినిమాలకు అవార్డుల పంట


69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో తెలుగు ఇండస్త్రీ సత్తా చాటింది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ - 2023 లో ఏకంగా 11 పురస్కరాలకు తెలుగు సినిమాలు ఎంపికయ్యాయి. 2021 సంవత్సరానికి గానూ 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు అవార్డులు ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే ఉత్తమ నటుడు కేటగిరీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. తద్వారా 68 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. తెలుగు కాకుండా ఇతర భాషలకు వచ్చిన అవార్డులను పరిశీలిస్తే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కేజీఎఫ్‌కు ఎందుకు రాలేదు?


కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 'పుష్ప: ది రైజ్' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటి అవార్డును అలియా భట్ (గంగూబాయి) & కృతి సనన్ (మిమి) సంయుక్తంగా గెలుచుకున్నారు. ఈసారి నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాలు డామినేషన్ చూపించాయి. తెలుగు చిత్రాలకు 11 పురస్కారాలు వస్తే, వాటిలో 6 అవార్డులు RRR మూవీకి దక్కాయి. అయితే ఈ చిత్రం 2022 లో రిలీజైతే, 2021 అవార్డ్ ఎందుకు ఇచ్చారు? అదే 2022 లో విడుదలైన 'KGF 2' చిత్రాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అని కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జాతీయ చలన చిత్ర అవార్డులకు ప్రమాణాలు ఏంటి? ఏ ప్రాతిపదికన ఇస్తారు? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ప్రభావం చూపలేకపోయిన రాజమౌళి


రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘RRR’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘‘నాటు నాటు’’ సాంగ్‌కు వీర లెవల్‌లో వైరల్ అయ్యింది. చివరికి ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఆ మూవీకి దర్శకత్వం వహించిన రాజమౌళికి గానీ.. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గానీ వేదికను పంచుకొనే అవకాశం కూడా రాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలుగులో సీబీఎస్‌ఈ బోధన


సీబీఎస్‌ఈ సిలబస్‌ పాఠశాలల్లో ఇకపై తెలుగులో కూడా బోధన మొదలుకానుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. నూతన విద్యా విధానం అమలు మొదలు వైద్య, న్యాయ, ఇంజినీరింగ్ కోర్సులను భారతీయ భాషల్లో బోధించేందుకు ఏర్పాట్ల వరకు దేశ విద్యారంగం కొత్తరూపు సంతరించుకుంటుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ట్రంప్ అరెస్టు 


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. గురువారం (ఆగస్టు 24, 2023) జార్జియా రాష్ట్రంలోని ఫుల్టన్ కౌంటీలో ఆయన్ని అరెస్టు చేశారు. ట్రంప్ లొంగిపోయే అవకాశం కోర్టు కల్పించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


శభాష్ ప్రజ్ఞానంద 


భారత గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్లకే చదరంగ ప్రపంచకప్‌ రన్నరప్‌గా అవతరించాడు. ఫైనల్లో విజయం సాధించనప్పటికీ భారతీయులు గర్వపడేలా చేశాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత విశ్వ చదరంగ యుద్ధాల్లో మహామహులను ఢీకొట్టగల ధీరుడు మనకున్నాడని చాటాడు. భవిష్యత్తులో కచ్చితంగా గెలుస్తాననే ధీమాను కల్పించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఈ కారుపై లుక్కేయండీ


దేశంలోని కస్టమర్లు ఇప్పుడు కారు కొనుగోలు చేసేటప్పుడు సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొంది మన దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ కార్ల గురించి తెలుసుకుందాం. మహీంద్రా స్కార్పియో ఎన్, టాటా ఆల్ట్రోజ్ భారతదేశంలో అందుబాటులో ఉన్న రెండు సురక్షితమైన కార్లు. ఈ లిస్ట్‌లో ఏయే కార్లు ఉన్నాయో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి