69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో తెలుగు ఇండస్త్రీ సత్తా చాటింది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ - 2023 లో ఏకంగా 11 పురస్కరాలకు తెలుగు సినిమాలు ఎంపికయ్యాయి. 2021 సంవత్సరానికి గానూ 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు అవార్డులు ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే ఉత్తమ నటుడు కేటగిరీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. తద్వారా 68 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. తెలుగు కాకుండా ఇతర భాషలకు వచ్చిన అవార్డులను పరిశీలిస్తే...
జాతీయ ఉత్తమ చిత్రంగా 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ ' (హిందీ) సినిమాకు అవార్డు వరించింది. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్. మాధవన్ అన్నీ తానై వ్యవహరించారు. ప్రధాన పాత్ర పోషించడమే కాదు, స్క్రిప్ట్ రైటర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా సత్తా చాటారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా జాతీయ సమగ్రతపై 'ఉత్తమ చిత్రం'గా ఎంపికైంది.
ఇక 2021 సంవత్సరానికి గాను ఉత్తమ నటి అవార్డును ఆలియా భట్ & కృతిసనన్ సొంతం చేసుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'గంగూబాయి కతియావాడి' సినిమాలో అలియా అద్భుతమైన నటన కనబరిచింది. అలానే లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన 'మిమి' మూవీలో కృతిసనన్ తన పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేసింది. అందుకే ఈసారి ఈ ఇద్దరు హీరోయిన్లకు కలిపి నేషనల్ అవార్డును ప్రకటించారు.
ఉత్తమ సహాయ నటుడు అవార్డును 'మిమి' సినిమా నుంచి బాలీవుడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠీ దక్కించుకున్నారు. 'ది కశ్మీరీ ఫైల్స్' చిత్రంలో నటించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయ నటి పురస్కారం వరించింది. అలానే 'గోదావరి' అనే మరాఠీ సినిమాని తెరకెక్కించిన నిఖిల్ మహాజన్ 'ఉత్తమ దర్శకుడు' అవార్డును సొంతం చేసుకున్నారు. 'గంగూబాయ' చిత్రానికి బెస్ట్ అడాప్షన్ స్క్రీన్ ప్లే & బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు వచ్చాయి.
ఫీచర్ ఫిలిం విభాగంలో ఉత్తమ హిందీ చిత్రంగా 'సర్దార్ ఉద్ధమ్' అవార్డును గెలుచుకుంది. సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించారు. రక్షిత్ శెట్టి నటించిన 'చార్లీ 777' మూవీ బెస్ట్ కన్నడ ఫిల్మ్ గా ఎంపికైంది. ఉత్తమ మరాఠీ చిత్రంగా 'హోమ్'.. ఉత్తమ తమిళ చిత్రంగా 'కడైసి వివసాయి' (ద లాస్ట్ ఫార్మర్) సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. అయితే తమిళ్ నుంచి కచ్చితంగా అవార్డులు సాధిస్తాయని అనుకున్న 'జై భీమ్', 'కర్ణన్', 'సర్పట్టా పరంపర' సినిమాలు పూర్తిగా విస్మరించబడాయి.
విభాగాల వారీగా 'నేషనల్ ఫిలిం అవార్డ్స్-2023' విజేతల జాబితా (తెలుగు కాకుండా)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి) & కృతి సనన్ (మిమి)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ)
బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా)
నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)
ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా)
బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్‌మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం)
బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్)
బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం)
బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ)
బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం)
ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం)
భాషల వారీగా బెస్ట్ ఫీచర్ ఫిలింస్:
బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777
బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్
బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్)
బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్
బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్
బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్
బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో
బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్
బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా
బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్)
బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష‍్య (ద వెయిట్)
నాన్ ఫీచర్ ఫిలింస్:
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ)
బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్)
బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్)
బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా)
బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ)
ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ)
ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ)
బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం)
బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ)
బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం)
బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్‌డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ)
బెస్ట్ ఎన్వైర్‌మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం)
బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్)
బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్‌నెస్ (హిందీ-బెంగాలీ)
బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్
బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా)
బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్‌డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి)
బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ)
Also Read: National Film Awards 2023: జాతీయ ఉత్తమ నటుడిగా జెండా పాతిన మొట్టమొదటి తెలుగోడు - ఇది పుష్ప రూలు!