National Film Awards 2023: 2021 ఏడాదికి గానూ చలనచిత్ర జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డులను జ్యూరీ సభ్యులు గురువారం (ఆగస్టు 24) ఢిల్లీలో చదివి వినిపించారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డు వరించింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకి ఈ అవార్డు దక్కింది. అలాగే, బెస్ట్ తెలుగు ఫిల్మ్ విభాగంలో ఉప్పెనకు అవార్డు వరించింది. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్, బెస్ట్ కొరియాగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేల్ సింగర్, బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ జాతీయ అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్ (కొండపొలం)కు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ (ఆర్ఆర్ఆర్) కు గానూ కీరవాణికి జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ఆర్ఆర్ఆర్ కి అవార్డు వచ్చింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో పురుషోత్తమాచార్యులకు నేషనల్ అవార్డు దక్కింది.


తెలుగు సినిమాలకు ఈసారి మొత్తం 10 జాతీయ అవార్డులు వచ్చాయి. అల్లు అర్జున్ కు జాతీయ పురస్కారం రావడంతో ఆ ఘనత సాధించిన తొలి హీరో అని అభివర్ణిస్తున్నారు. ఈసారి ఉత్తరాదితో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమకే అత్యధిక అవార్డులు రావడం విశేషం.


ఉత్తమ జాతీయ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప - ది రైజ్)
ఉత్తమ జాతీయ నటి (ఇద్దరు) - అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్‌ (మీమీ)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్


తెలుగు వారికి వరించిన అవార్డులు
బెస్ట్ తెలుగు ఫిల్మ్ - ఉప్పెన
బెస్ట్ మ్యూజిక్ (సాంగ్స్) - దేవిశ్రీ ప్రసాద్
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డ్ - ఆర్ఆర్ఆర్ (కింగ్ సోలోమన్)
బెస్ట్ కొరియోగ్రఫీ - ఆర్ఆర్ఆర్ (ప్రేమ్ రక్షిత్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - ఆర్ఆర్ఆర్ (వి.శ్రీనివాస్ మోహన్)
బెస్ట్ మేల్ సింగర్ - ఆర్ఆర్ఆర్ (కాలభైరవ)
బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ - ఆర్ఆర్ఆర్ (కీరవాణి)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ - ఆర్‌ఆర్‌ఆర్‌ (రాజమౌళి)
బెస్ట్ లిరిసిస్ట్ - చంద్రబోస్ (కొండపొలం)


ఇతర భాషల్లో
బెస్ట్ డైరెక్టర్: నిఖిల్‌ మహాజన్‌ (గోదావరి -మరాఠీ)
బెస్ట్ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్‌-హిందీ)
బెస్ట్ సహాయ నటుడు: పంకజ్‌ త్రిపాఠి (మిమి-హిందీ)
బెస్ట్ డైలాగ్స్ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: సర్దార్‌ ఉద్దమ్‌ (అవిక్‌ ముఖోపాధ్యాయ)
బెస్ట్ ఫీమేల్ సింగర్: శ్రేయఘోషల్‌ (ఇరివిన్‌ నిజాల్‌ - మాయావా ఛాయావా)
బెస్ట్ కాస్ట్యూమ్స్‌: వీర్‌ కపూర్‌ ఇ (సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్)
బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌: సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌ (దిమిత్రి మలిచ్‌, మన్సి ధ్రువ్ మెహతా)
బెస్ట్ ఎడిటింగ్‌: సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)


బెస్ట్ తమిళ్ ఫిల్మ్ - కదాయిసి వివాసాయి
బెస్ట్ మలయాలం ఫిల్మ్ - హోం
బెస్ట్ కన్నడ ఫిల్మ్ - 777 ఛార్లీ
బెస్ట్ బెంగాలీ ఫిల్మ్ - కాల్కోఖో - హౌస్ ఆఫ్ టైమ్
బెస్ట్ హిందీ ఫిల్మ్ - సర్దార్ ఉధమ్
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్ - (ఛెల్లో షో) 
బెస్ట్ మైథిలీ ఫిల్మ్ - సమనాంతర్
బెస్ట్ మరాఠీ ఫిల్మ్ - ఎక్‌దా కాయ్ జాలా
బెస్ట్ ఒడియా ఫిల్మ్ - ప్రతీక్షా (ద వెయిట్)
ఉత్తమ మేకప్‌: ప్రీతిశీల్‌ సింగ్‌ డిసౌజా (గుంగూబాయి కాఠియావాడి)