భారతీయ సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను (నేషనల్ ఫిలిం అవార్డ్స్ - 2023) కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో అత్యుతమ నటనకు గానూ 'జాతీయ ఉత్తమ నటుడు' అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సొంతం చేసుకున్నారు. 






69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ సత్తా చాటారు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను 'బెస్ట్ యాక్టర్ మేల్' క్యాటగిరీలో అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇంతవరకూ ఏ ఒక్క నటుడికి కూడా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు రాలేదు. అయితే ఈసారి బన్నీ జాతీయ అవార్డు అందుకొని 


RRR హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేదా 'పుష్ప' స్టార్ అల్లు అర్జున్ లలో ఎవరో ఒకరు ఈ ఏడాది జాతీయ స్థాయిలో 'బెస్ట్ యాక్టర్ అవార్డ్' అందుకోవాలని తెలుగు సినీ అభిమానులు కోరుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి ఉత్తమ నటుడి అవార్డు మన తెలుగు హీరోకే దక్కింది. ఉత్తమ నటుడిగా బన్నీ అవార్డు సాధించి, తెలుగు సినిమా కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పారు.


సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా 'పుష్ప: ది రైజ్' (పార్ట్ 1) సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్, స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్రంలో చూపించారు. రెండేళ్ల కిందట థియేటర్లలో విడుదలైన చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ సర్క్యూట్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో పుష్పరాజ్ గా బన్నీ అద్భుతమైన నటనతో పాటుగా తగ్గేదేలే వంటి డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ అంశాలే ఇప్పుడు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సాధించడానికి కారణమయ్యాయి. ఈ అవార్డుతో రాబోయే 'పుష్ప: ది రూల్' సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పాలి.