ఎన్టీఆర్, మోక్షజ్ఞ టైట్ హగ్ - నందమూరి అభిమానుల్లో ఆనందం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నట సింహం నందమూరి బాలకృష్ణ మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపించాయి. తారకరత్న మరణం తర్వాత వీరి మధ్య మరింత గ్యాప్ వచ్చినట్లు ఊహాగానాలు వచ్చాయి.  ఈ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్, తన తాతా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనలేదనే టాక్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ లాంటి వారు ఎన్టీఆర్ మరణానికి కారణం అయిన వారితో కలిసి వేదిక పంచుకోలేకే జూనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు దూరంగా ఉన్నారని చెప్పారు. నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆరే నిజమైన మగాడు అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. అయితే, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గానీ, అటు బాలయ్య గానీ, ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'కింగ్‌ ఆఫ్‌ కొత్త' రివ్యూ : యాక్షన్ హీరోగా దుల్కర్ సల్మాన్ హిట్ అందుకుంటారా? లేదా?
'మహానటి', 'సీతా రామం' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. భాషలకు అతీతంగా జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న కథానాయకుడు. ఆయన నటించిన 'కింగ్ ఆఫ్ కొత్త' ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. గ్యాంగ్‌స్టర్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'వృషభ' - జెట్ స్పీడ్‌లో రోహన్, మోహన్ లాల్ సినిమా షూటింగ్!
మలయాళ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వృషభ'. నందకిషోర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రోషన్ సరసన షనాయ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..  శ్రీకాంత్, కన్నడ నటి రాగిణి ద్వివేది, ఒకప్పటి హిందీ నటి సల్మా కుమార్తె జహ్రా ఎస్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘బిగ్ బాస్’ బడా ప్లాన్ - తమిళ హీరో, ‘సీమశాస్త్రీ’ బ్యూటీ, ఆ శృంగార తారకు బంపర్ ఆఫర్?
రియాలిటీ షోలలో బిగ్ బాస్‌కు ఉన్న క్రేజే వేరు. అందులోనూ ‘బిగ్ బాస్’కు మరింత ఎక్కువ క్రేజే ఉంటుంది. అందుకే తెలుగులో బిగ్ బాస్ 7వ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ గురించి అనేక కథనాలు, వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ 7లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్‌లో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తుండగా.. తాజాగా మరో కనుమరుగైపోయిన హీరో, హీరోయిన్ కూడా బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అవుతారని టాక్ వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


RRR నటుడు రే స్టీవెన్‌సన్‌కు డిస్నీ ప్లస్ అరుదైన గౌరవం, ‘Ahsoka’ సీరిస్‌లో ఘన నివాళి
‘RRR’ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్. 58  ఏండ్ల వయసులో మే 22న ఆయన మరణించారు. తన 59వ పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందు కన్నుమూశారు. గుండె సంబంధ సమస్యతో ఆయన మృతి చెందారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’లో స్కాట్ దొరగా రే స్టీవెన్సన్ అద్భుత విలనిజం పండించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)