మలయాళ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వృషభ'. నందకిషోర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రోషన్ సరసన షనాయ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..  శ్రీకాంత్, కన్నడ నటి రాగిణి ద్వివేది, ఒకప్పటి హిందీ నటి సల్మా కుమార్తె జహ్రా ఎస్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను పంచుకున్నారు. అందులో మోహన్ లాల్ కత్తి దూస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది. దీన్నిబట్టి సినిమాలో మోహన్‌లాల్ ఓ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మైసూర్‌ షెడ్యూల్లో ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిర్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించినట్లు సమాచారం. మరోవైపు హీరో రోషన్ సైతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు సెట్స్ లో మూవీ టీంతో దిగిన ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.






ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన 'వృషభ' టీం ఆలస్యం చేయకుండా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2024 ఆరంభంలో సినిమాని గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాకుండా అత్యున్నత సాంకేతిక నిర్మాణ విలువలతో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా కోసం మేకర్స్  ఓ హాలీవుడ్ ఫిలిం మేకర్ ని తీసుకున్నారు. 'మూన్‌లైట్' 'త్రీ బిల్‌బోర్డ్స్', 'ఔట్‌సైడ్ ఎబ్బింగ్', 'మిస్సౌరీ' వంటిహాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ థర్లో 'వృషభ' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.






సినిమాకి హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకే ఆయన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్ స్కేల్లో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలను నెలకొన్నాయి. మలయాళం తో పాటు తెలుగులో ఒకేసారి ఈ చిత్రీకరిస్తున్న ఈ సినిమాని ఇతర జాతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,500 లకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏవీఎస్ స్టూడియోస్ అధినేతలు అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా... ఫస్ట్ స్టెప్ మూవీస్ అధినేత శ్యామ్ సుందర్... బాలాజీ టెలీ ఫిలిమ్స్ అధినేతలు ఏక్తా కపూర్, శోభా కపూర్... కంటెంట్ మీడియా వరుణ్ మాథుర్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


Also Read : 'రామాయణం' నుంచి ఆలియా భట్ ఔట్? యశ్ కూడా అనుమానమే - భయపడుతున్నారా?








Join Us on Telegram: https://t.me/abpdesamofficial