‘మహానటి’ చిత్రంతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. ఈ చిత్రంలో నటనకు గాను పలు అవార్డులు దక్కడంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో చక్కటి అవకాశాలు లభించాయి. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది కీర్తి.  ప్రస్తుతం టాప్ హీరోల చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా కీర్తి సురేష్ 4 తమిళ చిత్రాల్లో నటిస్తుండగా, ఓ తెలుగు సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 


మత్యకారుల పాత్రల్లో కీర్తి, నాగచైతన్య!


దర్శకుడు చందు మొండేటి, అక్కినేని నాగ నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య, కీర్తి సురేష్ మత్స్యకారులుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఈ చిత్ర బృందం ఇప్పటికే శ్రీకాకుళం వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. చేపలు పట్టే వారి జీవన శైలి ఎలా ఉంటుంది? వాళ్లు ఎలా జీవిస్తున్నారు? సముద్రంలోకి వెళ్లి ఎలా చేపలు పడుతారు? అనే విషయాలను గమనించారు. కీర్తి సురేష్ కూడా త్వరలో శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారుల జీవన విధానాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె వారితో కలిసి వారం రోజుల పాటు గడపనున్నట్లు తెలుస్తోంది.


త్వరలో మూవీ షూటింగ్ షురూ


ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి ఈ మూవీలో హీరోయిన్ కోసం ఇద్దరిని ఎంపిక చేశారట. వారిలో ఒకరు సాయి పల్లవి కాగా, మరొకరు కీర్తి సురేష్. వీరిద్దరి పేర్లను పరిశీలించిన చిత్రబృందం చివరకు కీర్తి సురేష్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయి పల్లవి నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, నాగ చైతన్య ప్రియురాలిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు  సంబంధించి దర్శకుడు చందు, నాగ చైతన్య కలిసి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఈ సినిమాను వాస్తవ ఘటనల ఆధారంగా తీస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.   


కీర్తి క్రేజ్ నాగ చైతన్యకు కలిసి వచ్చేనా?


కీర్తి సురేష్  తాజాగా  ఈమధ్యనే 'భోళా శంకర్' సినిమాలో నటించింది.  ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిగా ఆమె నటించింది. అయితే, ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రేక్షకులను అలరించడంలో ఈ మూవీ విఫలం అయ్యింది. ఈ సినిమా కంటే ముందుకు నటించిన ‘దసరా’ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. నేచురల్ స్టార్ నానితో కలిసి ఆమె ఈ చిత్రంలో నటించింది. కీర్తి నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ క్రేజ్ నాగ చైతన్యకు కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కీర్తి సురేష్ ఇప్పటికే ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్  తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది 'సైరన్', 'రివాల్వర్ రీటా, 'రఘు తథా', 'కన్నివేడి' చిత్రాల్లో నటిస్తోంది.   


Read Also: 'ది సోల్‌ ఆఫ్‌ సత్య' గీతాన్ని 3 భాషల్లో అద్భుతంగా ఆలపించిన రాశీ ఖన్నా - ఒరిజినల్ కంటే బాగుందట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial