సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి జంటగా 'ది సోల్‌ ఆఫ్‌ సత్య' అనే మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్‌ ఇటీవలే యూట్యూబ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ గీతాన్ని, ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అయితే తాజాగా ఈ సాంగ్ ను హీరోయిన్ రాశీ ఖన్నా ఆలపించింది. దీనికి సంబంధించిన వీడియోను టీ-సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.


'ది సోల్‌ ఆఫ్‌ సత్య' పాటను రాశీ ఖన్నా బ్యూటిఫుల్ గా పాడింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలను మిక్స్ చేసి పాడిన విధానానికి సంగీత ప్రియులు ఫిదా అవుతున్నారు. ఫీల్ గుడ్ సాంగ్ కు అంతే ఫీల్ తో పాడిందనినెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోల్‌ ఆఫ్‌ సత్య రాశి ఫీట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మూడు భాషల్లో ఆమె చాలా చక్కగా పాడిందని, చెప్పలంటే ఒరిజినల్ కంటే ఇదే తమకు నచ్చిందని పలువురు అంటున్నారు. అయితే, దీన్ని ఒరిజినల్‌తో పోల్చవద్దని, దేని వాల్యూ దానికి ఉంటుందని.. అదీ బాగుంది.. ఇది కూడా బాగుందని మరికొందరు అంటున్నారు.



రాశీ ఖన్నా హీరోయిన్ మాత్రమే కాదు గాయని కూడా అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె గతంలో 'జోరు', 'విలన్', 'బాలకృష్ణుడు', 'జవాన్', 'ఊరంతా అనుకుంటున్నారు', 'ప్రతిరోజూ పండగే' వంటి చిత్రాలలో కొన్ని పాటలు పాడింది. ఈ క్రమంలో ఇప్పుడు 'ది సోల్ ఆఫ్ సత్య' గీతాన్ని తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది. 


Also Read: రామ్ పోతినేని కోసం రంగంలోకి దిగనున్న బాలయ్య?


దేశ రక్షణ కోసం మన జవాన్లు ప్రాణాలకు తెగించి, ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఎన్నో త్యాగాలతో వారిని సరిహద్దులకు పంపించిన కుటుంబ సభ్యులు.. వారి జ్ఞాపకాలతో జీవిస్తుంటారు. అలాంటి తల్లులు, భార్యలు, తోబుట్టువులందరికీ నివాళులర్పిస్తూ.. 'ది సోల్ ఆఫ్ సత్య' గీతాన్ని రూపొందించారు. ఇందులో సత్య అనే యువతి తన భర్తను యుద్ధానికి పంపించి, అతని జ్ఞాపకాలతో ఎలా జీవితాన్ని సాగించింది అనేది ఎమోషనల్ గా చూపించారు. 


'సోల్ ఆఫ్ సత్య' మ్యూజికల్ వీడియోకి సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్‌ విజయకృష్ణ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై 'బలగం' నిర్మాతలు హర్షిత్‌, హన్షిత నిర్మించారు. ఈ సాంగ్ కు శృతి రంజనీ ట్యూన్ కంపోజ్ చేయగా, రితేష్ రావు లిరిక్స్ రాశారు. సింగర్ తులసి కుమార్ ఆలపించారు. డీఓపీగా బాలాజీ సుబ్రహ్మణ్యం, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వర్క్ చేశారు. రాబిన్ సబ్బు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.


రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల.. 


ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ది సోల్ ఆఫ్ సత్య' మ్యూజిక్ వీడియోని విడుదల చేసి, టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో దాదాపు 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు రాశి ఖన్నా ఫీట్ తో ఈ సాంగ్ రీచ్ మరింత పెరిగే అవకాశం ఉంది.


Also Read:  'నా న్యూడ్ వీడియోలను 50 లక్షలకు అమ్మేశాడు'



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial