Sajjala On Fake Votes :  ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల విషయంలో  తెలుగుదేశం పార్టీ నేతలు దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది.  ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడారు. ఈసీ చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తుందా అని ప్రశ్నించారు.  ఓట్ల తొలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారమని ..   టీడీపీ అసలు స్వరూపం అందరికీ తెలిసిందేనన్నారు.


ఏపీలో ఇంకా లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు                            


ఏపీలో అరవై లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు.  లక్షల దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని.. వీటన్నిటినీ ఎన్నికల కమిషన్ తొలగిస్తే ప్రజా తీర్పు కచ్చితంగా వస్తుందని మా నమ్మకమని ఆయన చెప్పుకొచ్చారు.  కుప్పం నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు బయట పడ్డాయన్నారు.  దొంగ ఓట్ల వ్యవహారంలో చంద్రబాబుకు భయం పట్టుకుందని.. టీడీపీ అన్యాయంగా తీసేయించిన ఓట్లను మేము చేర్పించుకుంటామని ఆయన చెప్పారు.  గతంలో చంద్రబాబు ఒకే ఇంటి నెంబర్ మీద 770 ఓట్లను చేర్పించారని ఆరోపించారు.  ఉరవకొండలో ఓట్ల తొలగింపులో చేసిన ప్రొసీజర్ సరిగా లేనందునే  అధికారులను సస్పెండ్ చేశారని... అంతేకానీ ఓట్లను తొలగించారని కాదని సజ్జల చెప్పుకొచ్చారు. 


గతంలో జరిగిన తప్పుల్ని సరి చేస్తున్నామన్న సజ్జల                              


టీడీపీ గతంలో చేసిన తప్పులను తాము సరి చేస్తున్నామని సజ్జల చెప్పారు.  గతంలో వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారన్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తోంది. టీడీపీకి తెలిసిందల్లా అడ్డదారులు తొక్కడమే. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు.. ఆయన తన విద్యలను అఖిల భారత స్థాయిలోనూ ప్రదర్శించారని విమర్శఇంచారు.   టీడీపీలో గతంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను చేర్పించాం. ఉరవకొండలో అక్రమాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. గతంలో  ఓ యాప్ ను తయారు చేసి  టీడీపీ కార్యకర్తల చేతిలో పెట్టి వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించారని సజ్జల ఆరోపించారు.       


చంద్రబాబు మాటలకు పురందేశ్వరి వత్తాసు పలుకుతున్నారన్నసజ్జల                                                           


వైసీపీ అనుకూలం అనుకున్న వారందరి ఓట్లనూ  తొలగించారు. ఎంతో పోరాటం చేసి మళ్ళీ కొంతవరకు మా ఓట్లను చేర్పించుకోగలిగామని..తెలిపారు.  లక్షన్ కమిషనర్‌ని చంద్రబాబు అప్పట్లో బెదిరించారు. అలాంటి పనులు మేము చేయాల్సిన పని మాకు లేదు. ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేసే మేము భయపడాల్సిన పనిలేదన్నారు.   చంద్రబాబు  మాటలకు  పురందేశ్వరి  వత్తాసు  పలుకుతున్నారని  విమర్శించారు.