Fixed Deposit: రిజర్వ్ బ్యాంక్, గత మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్‌లోనూ రెపో రేటును స్థిరంగా ఉంచిన తర్వాత, దేశంలోని కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచితే, మరికొన్ని తగ్గించాయి. అయితే, ఎక్కువ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచాయి.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank) కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDs) వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త FD వడ్డీ రేట్లు ఈ నెల 21వ తేదీ (21 ఆగస్టు 2023) నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త రేట్ల ప్రకారం అటు సీనియర్ సిటిజన్లకు, ఇటు సాధారణ జనానికి భారీ ఇంట్రెస్ట్ రేట్లను ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు, ఈ బ్యాంక్, సీనియర్ సిటిజన్‌లకు FD మీద గరిష్టంగా 9 శాతం వడ్డీ ఆదాయాన్ని అందిస్తోంది. సాధారణ ప్రజలకు 8.5% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తోంది.
సాధారణ ప్రజల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు:
7 రోజుల నుంచి 29 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 3.5 శాతం వడ్డీ రేటు
30 రోజుల నుంచి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 4 శాతం వడ్డీ రేటు
46 రోజుల నుంచి 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 4.5 శాతం వడ్డీ రేటు
91 రోజుల నుంచి 180 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 5.25 శాతం వడ్డీ రేటు
181 రోజుల నుంచి 364 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 6.25 శాతం వడ్డీ రేటు
సరిగ్గా ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటు
ఒక సంవత్సరం పైన ఒక రోజులో మెచ్యూర్ అయ్యే FDలపై 8 శాతం వడ్డీ రేటు
367 రోజుల నుంచి 443 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 8.2 శాతం వడ్డీ రేటు
ఇవే కాకుండా కొన్ని స్పెషల్ స్కీమ్స్‌ను కూడా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అమలు చేస్తోంది. వాటిలో, 444 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద సాధారణ ప్రజలు 8.5 శాతం వడ్డీ రేటును పొందొచ్చు.
445 రోజుల నుంచి 18 నెలల మధ్య కాల పరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ బ్యాంక్ 8.2 శాతం వడ్డీ ఆదాయాన్ని అందిస్తుంది. 18 నెలల ఒక రోజు నుంచి 2 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.75 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
2 రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి 887 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది. 888 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 8.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 889 రోజుల నుంచి 3 సంవత్సరాల మధ్య కాల పరిమితి కలిగిన FDలపై 8 శాతం వడ్డీని కస్టమర్లు అందుకోవచ్చు.
3 సంవత్సరాల ఒక రోజు నుంచి 3 నాలుగు సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే FDల కోసం, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 4 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే FDలకు 7.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
ఈ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద, సీనియర్ సిటిజన్లు సాధారణ కస్టమర్లకు వర్తించే రేటు కంటే 0.50 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు. 444 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై సీనియర్ సిటిజన్లు 9 శాతం వడ్డీ రేటును పొందుతారు.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోని డిపాజిట్లకు "డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్" (DICGC) ద్వారా రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. అంటే, ఒకవేళ ఈ బ్యాంక్ దివాలా తీస్తే, డిపాజిట్ మొత్తంలో గరిష్టంగా రూ.5 లక్షల వరకు (అసలు + వడ్డీతో కలిపి) తిరిగి వస్తాయి. కాబట్టి, రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్ల విషయంలో ఒకసారి ఆలోచించుకోవడం బెటర్.
మరో ఆసక్తికర కథనం: చంద్రయాన్ 3 ఎఫెక్ట్ - ఇన్వెస్టర్లను లాభాల మీద ల్యాండ్ చేసిన స్పేస్ స్టాక్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial