సీబీఎస్‌ఈ సిలబస్‌ పాఠశాలల్లో ఇకపై తెలుగులో కూడా బోధన మొదలుకానుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. నూతన విద్యా విధానం అమలు మొదలు వైద్య, న్యాయ, ఇంజినీరింగ్ కోర్సులను భారతీయ భాషల్లో బోధించేందుకు ఏర్పాట్ల వరకు దేశ విద్యారంగం కొత్తరూపు సంతరించుకుంటుంది.


తెలుగు సహా మరో 21 ప్రాంతీయ భాషల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధించాలని నిర్ణయించింది. ఆయా భాషల్లో పాఠ్యపుస్తకాలను రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీ కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఆ మేరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ప్రచురణపై దిశగా అడుగులు వేస్తోంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు, సంస్కరణలకు అనుకూలంగా.. భారతదేశ విద్యారంగం కొత్త మార్పులు సంతరించుకుంటోంది.


ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. 


ALSO READ:


'పీఎంశ్రీ' దరఖాస్తుకు ఆగస్టు 26తో ముగియనున్న గడువు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) రెండో విడత దరఖాస్తు గడువు ఆగ‌స్టు 26తో ముగియనుంది. రెండో విడతకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 4,930 పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఎంపికైన పాఠశాలలను జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేస్తారు.ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ పాఠశాలల) పథకంలో భాగంగా తొలి విడతలో దేశవ్యాప్తంగా మొత్తం 6,448 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఏపీ నుంచి 623 పాఠశాలలు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి 543 పాఠశాలలు ఉన్నాయి. ఏపీ నుంచి ఎంపికైన వాటిలో 33 ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా, 629 సెకండరీ/సీనియర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ఎంపికైన వాటిలో 56 ఎలిమెంటరీ పాఠశాలలు కాగా, 487 సెకండరీ/సీనియర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొత్త పీజీ కోర్సు అందుబాటులోకి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..