Top 10 Headlines Today: 


1 . దీపావళి నుంచే ఉచిత గ్యాస్

సీఎం చంద్రబాబు ప్రజలకు శుభవార్త చెప్పారు. దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. పండుగను పురస్కరించుకొని మొదటి సిలిండర్‌ను అందిస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

2. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు

వైసీపీ హయాంలో తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారు. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా మారింది. దానికి కారణం ఏంటన్న విషయాన్ని చంద్రబాబు బయటపెట్టారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైసీపీ ప్రభుత్వం కలిపిందని చంద్రబాబు స్వయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయ్యింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

3. నేడు పవన్‌తో బాలినేని భేటీ

ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే బాలినేని తదుపరి రాజకీయ భవిష్యత్ ఏంటనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ కానున్నారు. ఈ భేటీలో జనసేనలో చేరికపై బాలినేని.. పవన్‌తో చర్చించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

4. బావ జగన్‌ను బాలినేని ఎందుకు కాదనుకున్నారు?

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు గుడ్ బై చెప్పారు. అయితే, వైఎస్ జగన్ కు బాలినేని బంధువు. YS కుటుంబ సభ్యుల్లో ఒకడుగా బాలినేని మెలిగారు. మద్యం విధానాన్ని బాలినేని పూర్తిగా వ్యతిరేకించారు. తన కళ్ల ముందే ఎంతో మంది మద్యం విధానంపై తిడుతున్నారని చెప్పినా జగన్ పట్టించుకోలేదు. ఈసారి ఓడిపోతామని చెప్పినా జగన్ తన దూకుడును ఆపలేదు. దీంతో బాలినేని జగన్ తో విభేదించాల్సి వచ్చిందని తెలుస్తోంది. . పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

5. దసరాకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి..

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. అక్టోబర్‌లో విజయదశమి రానున్న క్రమంలో ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వ దర్శనం మొదలుకుని ప్రత్యేక దర్శనం వరకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

6. మంత్రులకు టీపీసీసీ చీఫ్ కొత్త రూల్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులంతా వారానికి రెండు సార్లు గాంధీభవన్ కు రావాలని నిర్దేశించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, మంత్రులు రావాల్సిన షెడ్యూల్‌ను ఖరారు చేయాలని గాంధీభవన్ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్కో మంత్రి గాంధీ భవన్‌కు రావాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. గాంధీ భవన్లో ఎలాంటి పవర్ సెంటర్లు లేవని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

7. జమిలికి గ్రీన్ సిగ్నల్

కేంద్ర కేబినెట్ వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు ఈ బిల్లు రానుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

8. జమిలీ ఎన్నికలతో దేశం సర్వ నాశనం: ఒవైసీ

వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఎంఐఎం భగ్గుమంది. జమిలి ఎన్నికలతో దేశం సర్వనాశనం అవుతుందని, మోదీ అమిత్ షాలకు మాత్రమే ఈ ఎన్నికలతో ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బీజేపీ జమిలి ఎన్నికలను సమర్ధిస్తుందని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

9. డీఎస్పీగా విధుల్లో చేరిన నిఖత్ జరీన్

తెలంగాణ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్‌ జరీన్‌ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నిఖత్ జరీన్ కు జాయినింగ్‌ ఆర్డర్‌ను డీజీపీ జితేందర్ స్వయంగా అందజేశారు. తెలంగాణ స్పెషల్‌ పోలీసు విభాగంలో డీఎస్పీగా నిఖత్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నిఖత్‌ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

10. నేటి నుంచే తొలి టెస్టు

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై 2012 నుంచి టెస్టుల్లో ఓటమి ఎరుగని భారత్ ఈ సిరీస్‌ని కూడా గెలవాలని చూస్తోంది. పాక్‌ను వైట్ వాష్ చేసి ఊపుమీదున్న బంగ్లా ఈ సిరీస్‌ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..