Nikhat Zareen Appointed as DSP In Telangana | భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. నిజామాబాద్ కు చెందిన బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం లభించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ చేతుల మీదుగా నిఖ‌త్‌ జరీన్ డీఎస్పీగా నియామ‌క ప‌త్రం అందుకున్నారు.  
నిఖత్ జరీన్‌కు మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌ ఉంటుంది. కాగా, గ‌త నెల 1న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సెక్ష‌న్ 4లోని తెలంగాణ రెగ్యులేష‌న్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు స‌వ‌ర‌ణ చేసి రాష్ట్రానికి చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్ర‌భుత్వం హోంశాఖను ఆదేశించింది. 


మహిళా బాక్సర్ నికత్ జరీన్  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్) గా జాయినింగ్ రిపోర్ట్ ను రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ కు అందజేశారు. నిజామాబాద్ కు చెందిన నికత్ జరీన్ బాక్సింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ,ఏషియన్ గేమ్స్ లో కాంస్య పతకం సాధించారు. ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలంపిక్స్ లో ప్రీకార్టర్స్ కు చేరుకున్నారు. డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. డీఎస్పీ (Special Police) గా జాయినింగ్ రిపోర్టు నిఖత్ జరీన్ డీజీపీకి అందజేశారు.