Kumari Aunty Donates Money To CMRF: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రముఖ సంస్థలు సహా సామాన్యులు సైతం తమకు తోచిన సాయం అందిస్తున్నారు. తెలంగాణలో ఫుడ్ బిజినెస్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారీ ఆంటీ (Kumari Aunty) సైతం సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) తన కుమార్తెతో కలిసిన ఆమె.. రూ.50 వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను అభినందించారు. అలాగే, సీఎం సహాయ నిధికి టెక్నో పెయింట్స్ సంస్థ రూ.20 లక్షల విరాళం అందజేసింది. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిసిన టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాసరెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ చెక్ అందించారు. అటు, మంగళవారం సీఎంను కలిసిన మెగాస్టార్ చిరంజీవి సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. అలాగే, తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందించారు. నటుడు అలీ సైతం సీఎం సహాయ నిధికి రూ.3 లక్షలు అందజేశారు.
Also Read: CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం