Daily Horoscope for 19 September 2024

మేష రాశి 

మీరు ఈ రోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కోపం ప్రభావం మీ పనిపై పడుతుంది. మీ ప్రియమైనవారిపై నమ్మకం ఉంచండి. కీళ్ల నొప్పి సమస్యలు ఉంటాయి. రోజంతా బిజీగానే ఉంటారు. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గించుకోవాలి. 

వృషభ రాశి

ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో ఆంటకాలు ఎదురవుతాయి. బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. 

మిథున రాశి 

ఈ రాశివారు కుటుంబంలో సంతోషం ఉంటుంది. మనసులో ఏదైనా భయం ఉంటే అది ఈ రోజు తొలగిపోతుంది. దీవిత భాగస్వామి పట్ల గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also Read: దసరా వచ్చేస్తోంది.. ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఈ వాస్తు సూత్రాలు పాటించండి!

కర్కాటక రాశి

రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. గృహ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతాయి. ప్రేమకు సంబంధించిన విషయాలలో  నిరాశ చెందుతారు. కళారంగానికి సంబంధించిన వ్యక్తులు గౌరవం పెరుగుతుంది. 

సింహ రాశి 

మీ స్నేహితుల సలహాలపై శ్రద్ధ వహించండి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది..కాస్త ఓపికగా వ్యవహరించాల్సిన సమయం ఇది. కుటుంబ బంధాల విషయంలో సీరియస్ గా ఉండాలి. ప్రేమికులు పెళ్లిదిశగా వెళ్లేందుకు ఇదే మంచి సమయం. మీ మనసులో నిరాశ పెంచుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. 

కన్యా రాశి 

ఈ రోజు విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆన్ లైన్ వ్యాపారం చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

Also Read:  అజాన్..నమాజ్ సమయంలో దుర్గాపూజ ఆపేయండి!

తులా రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ  సభ్యుల గురించి ఆందోళన చెందుతారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ముఖ్యమైన అవకాశాలు మీ కోసం వేచి ఉన్నాయి. వృశ్చిక రాశి 

మీరు ఈ రోజంతా బిజీగా ఉంటారు. ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితం ఉంటుంది.

ధనుస్సు రాశి  

ఈ రోజు వ్యాపారులు ఆశించిన లాభాలు పొందలేరు. నూతన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇది సరైన సమయం కాదు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండదు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. మకర రాశి 

సామాజిక కార్యాలలో చురుకుగా ఉండండి. కమిషన్ సంబంధిత పనుల నుంచి ప్రయోజనం పొందుతారు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. 

Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి! కుంభ రాశి 

మీ ప్రతిష్ట పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైవాహిక సంబంధాలలో సంతోషం పెరుగుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. మీ నూతన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీన రాశి

ఈ రోజు కార్యాలయంలో అద్భుతమైన సమన్వయం ఉంటుంది. ముఖ్యమైన వ్యాపార సమావేశానికి హాజరు కావాల్సి ఉండొచ్చు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. మీ సామర్థ్యంపై విశ్వాసం ఉంచండి. అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.