Bangladesh Dussehra 2024: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల గొడవలు చినికి చినికి గాలివానగా మారి , తీవ్రమైన హింసకు దారి తీయడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి మన దేశానికి పారిపోయి వచ్చే పరిస్థితులు ఎదురయ్యాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత  హిందువులపై దాడులు పెరిగాయి. ఆలయాలను ధ్వంసం చేశారు, హిందూ వ్యాపారులను హింస పెట్టారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. త్వరలో శరన్నవరాత్రులు ప్రారంభం కానుండడంతో...బంగ్లా ప్రభుత్వం..అక్కడి హిందూ సమాజం ముందు కీలకమైన ప్రతిపాదన ఉంచింది. 


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!


అజాన్, నమాజ్ సమయాల్లో దుర్గాపూజకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిలిపేయాలని... ముఖ్యంగా సంగీత వాయిద్యాలు, పాటలు పాడడం లాంటివి చేయకూడదన్నది ఆ ప్రతిపాదన సారాంశం...


బంగ్లా దేశ్ హోం వ్యవహరాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) ఎండీ జహంగీర్ అలం చౌదరి స్వయంగా ఈ విజ్ఞప్తి చేశారు. నమాజ్ సమయంలో దుర్గా పూజ నిలిపేయాలని, అజాన్ కి ఐదు నిముషాల ముందే విరామం పాటించాలని కోరారు. సంగీత వాయిద్యాలు, సౌండ్ సిస్టమ్స్ ఆఫ్ చేయాలన్న విజ్ఞప్తులను హిందూ సంఘాలు అంగీకరించాయని చెప్పారు జహంగీర్ అలం. 


దుర్గా పూజ అంటే బంగ్లాదేశ్ లో హిందువులకు అతి పెద్ద పండుగ. ఈ మధ్య జరిగిన మత ఘర్షణలను పరిగణలోకి తీసుకుని బంగ్లా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది.


ఈ ఏడాది బంగ్లా వ్యాప్తంగా 32,666 పూజా మండపాలను ఏర్పాటు చేయనున్నట్లు జహంగీర్ అలం చౌదరి తెలిపారు.  వీటిలో 157 మండపాలు ఢాకా సౌత్ సిటీలో, 88 నార్త్ సిటీ కార్పొరేషన్లలో ఉంటాయని ఢాకా ట్రిబ్యూన్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్న దుర్గా మండపాల సంఖ్య ఎక్కువే. 2023 లో మండపాల సంఖ్య 33,431 కాగా....2024 లో 32,666 దుర్గా మండపాలు..


Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!


విగ్రహాల తయారీ మొదలు దసరా నవరాత్రులు పూర్తయ్యేవరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తాం. పూజా మండపాల వద్ద 24/7 భద్రతపై అధికారులతో చర్చించాం. సంఘ విద్రోహ శక్తులను అరికట్టి తీరుతాం - బంగ్లా దేశ్ హోం వ్యవహరాల సలహాదారు జహంగీర్ అలం చౌదరి హామీ ఇచ్చారు 


మనది మత సామరస్యం ఉన్న దేశం..మత సామరస్యాన్ని ధ్వంసం చేసే ఏ చర్యను కూడా ప్రోత్సహించం..చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. ఎవరైనా అల్లర్లకి కారణమైతే వారికి కఠిన శిక్ష తప్పదు -  బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్  


Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!


ఈ ఏడాది శరన్నవరాత్రులు అక్టోబరు  03 న ప్రారంభమై...9 రోజుల పాటూ సాగుతాయి. తొమ్మిది రోజులు శక్తి స్వరూపిణి తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. శరన్నరవాత్రుల్లో మూల నక్షత్రం రోజు నుంచి అత్యంత ముఖ్యమైన రోజులుగా భావిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. దుర్గాష్టమి, మహర్నవమి, విజయ దశమి..అక్టోబరు 12తో ముగుస్తాయి. 
  
దుర్గా గాయత్రి 
ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి తన్నోదుర్గా ప్రచోదయాత్