అష్టాదశ శక్తిపీఠాలు
1.శాంకరి - శ్రీలంక
శాంకరీ దేవి ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు కాని...ఇది తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండొచ్చుని చెబుతారు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల ఈ ఆలయం నాశనమయ్యిందని అందుకే ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందంటారు.
2. కామాక్షి - కాంచీపురం
కామాక్షీ దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు.
3. శృంఖల - ప్రద్యుమ్ననగరం
కోల్ కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లామాత గా పూజిస్తారు. కోల్ కతాకు దాదాపు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఓ శక్తిపీఠంగా చెబుతారు.
4. చాముండి - క్రౌంచ పట్టణం
చాముండి ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై కర్ణాటకలో ఉంది. అమ్మవారి కురులు ఈ ప్రదేశంలో పడ్డాయని స్థలపురాణం
Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు
5. జోగులాంబ-అలంపూర్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠం జోగులాంబ . అలంపూర్ లో ఉన్న ఈ శక్తిపీఠంలో సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం పడిందని స్థలపురాణం.
6. భ్రమరాంబిక - శ్రీశైలం
సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం.ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ద్వాదశ జోతిర్లింగ క్షేత్రాల్లో ఇదొకటి. ఈ పుణ్యప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం
7. మహాలక్ష్మి - కొల్హాపూర్
ఆది పరాశక్తి ‘అంబాబాయి'గా కొల్హాపూర్, మహారాష్ట్ర వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు.
8. ఏకవీరిక - మాహుర్యం
ఏక వీరిక శక్తిపీఠం మహారాష్ట్ర నాందేడ్ సమీపం మాహుర్ క్షేత్రంలో వెలిసింది. ఇక్కడ సతీదేవి కుడిచేయి పడి ఏకవీరా దేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది.
9. మహాంకాళి - ఉజ్జయిని
దేవీభాగవతం ప్రకారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొలువైంది మహంకాళి. ఈ ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని చెబుతారు. మహంకాళీ రూపంలో అమ్మవారు ఆ నగరాన్ని రక్షిస్తోందని భక్తుల విశ్వాసం.
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!
10.పురుహూతిక - పిఠాపురం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురంలో ఉన్న ఈ క్షేత్రంలో సతీదేవి పీఠబాగం పడిందని చెబుతారు. అందుకే ఈ ఊరికి పిఠాపురం అని పేరొచ్చిందని చెబుతారు.
11. గిరిజ - ఒడిశా
ఒడిశా, జాజ్‌పూర్ లో వెలసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి.
12. మాణిక్యాంబ -ద్రాక్షారామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ద్రాక్షారామంలో సతీ దేవి ఎడమ చెంప భాగం పడింది.... దక్షవాటికగా పిలిచే ఈ పుణ్యప్రదేశం పంచారామక్షేత్రాల్లో ఒకటి.
13. కామరూప- గౌహతి
అసోం రాజధానికి గౌహతి లో నీలాచల పర్వతశిఖరంపై కొలువైంది కామాఖ్యాదేవి.. ఇక్కడ సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థలపురాణం.
14. మాధవేశ్వరి -ప్రయాగ
అమ్మవారి కుడిచేతి వేళ్ళు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రం ఉండదు. నాలుగు దిక్కులా సమానంగా కట్టన పీఠం మాత్రం ఉంటుంది.
15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం
హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బదులు 7 జ్వాలలు వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి నాలుక భాగం పడిందని చెబుతారు.
Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!
16. మంగళ గౌరి - గయ
బీహార్ లోని గయా ప్రాంతంలో సతీదేవి స్తన భాగం పడిందని స్థలపురాణం. అందుకు నిదర్శనంగా వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.
17.విశాలాక్షి - వారణాసి
సతీదేవి మణికర్ణిక (చెవి భాగం)వారణాసిలో పడిందని స్థలపురాణం.
18.సరస్వతి - జమ్ముకాశ్మీర్
పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శక్తి పీఠం ఇది. ఇక్కడ అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.