Horoscope Today 24th March 2022: ఈ రాశివారు స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Continues below advertisement

2022 మార్చి 24 రాశిఫలాలు
మేషం 
ఈరోజంతా మీరు గందరగోళంగా ఉంటారు.ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అపరిచితులను నమ్మొద్దు. నిత్యం మీరు చేసే పనిలో స్వల్పమార్పులు ఉంటాయి. విద్యార్థులకు శుభసమయం. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. 

Continues below advertisement

వృషభం
వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. ఎక్కువ పని ఒత్తిడి తీసుకోకండి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమికులకు ఈ రోజు మంచిది...పెళ్లి దిశగా అడుగేయాలి అనుకునేవారికి అనుకూలసమయం.స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.

మిథునం 
ఈ రోజు మీకు అంత మంచిగా లేదు.నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారి ప్రయత్నాలు సక్సెస్ కావు.భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత ఉండాలి. మీ పిల్లల పురోగతిని చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. 

కర్కాటకం
ఇంటా-బయటా వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. బంధువులను కలుస్తారు. మీ దినచర్యను ఫాలో అయిపోయిండి. పిల్లల పని మీద ఓ కన్నేసి ఉంచండి.ఎవరి సలహాలు తీసుకోవద్దు. ఒత్తిడికి దూరంగా ఉండండి.

Also Read: ఆళ్వారుల వైభవాన్ని, కాకతీయుల పౌరుషాన్నీ చాటే శిల్పకళ- నారసింహుడి సన్నిధిలో త్రిమూర్తుల రూపాలు

సింహం 
ఈరోజు మీకు అంతగా కలసిరాదు.మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు. ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించవద్దు.అనారోగ్య సూచనలున్నాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. 

కన్య 
ఈరోజు మీకు కలిసొస్తుంది. ఆశించిన ఫలితాలు సాధించడంతో ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు.అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సాహిత్యం మరియు సంగీతం పట్ల ఆసక్తిని కనబరుస్తారు. దూరప్రాంత ప్రయాణాలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 

తుల 
ఈరోజు మీరు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. షేర్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. పెద్దల ఆశీస్సులు మీకు లాభిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారిని కలుస్తారు. పిల్లల ప్రవర్తనతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు.

వృశ్చికం 
స్నేహితులను కలుస్తారు. దాంపత్య  జీవితం బావుంటుంది. వ్యాపారులు చాలా బిజీగా ఉంటారు. మీరు చేసే సహాయం ఎవ్వరికీ చెప్పకండి..తెలియాల్సిన సమయంలో అందరకీ తెలుస్తుంది, మీ కీర్తి పెరుగుతుంది. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి.మీ పనులను పూర్తి చేయడంలో అలసత్వం వహించకండి.

ధనుస్సు
ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోకతప్పదు. అనుకోని అతిథులు ఇంటికి రావడంతో కొంత ఇబ్బంది పడతారు.ప్రభుత్వ పనుల్లో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు.అప్పులు ఇవ్వొద్దు. 

Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం

మకరం 
ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. మీ దినచర్య క్రమశిక్షణతో ఉంటుంది. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు.

కుంభం
విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా స్పెండ్ చేస్తారు. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో వచ్చే అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. ఇంటి వాతావరణం బాగుంటుంది.

మీనం 
ఆర్థికంగా ఇబ్బంది పడతారు.పని ప్రదేశంలో ఒత్తిడి ఉంటుంది. అతి విశ్వాసంతో పెద్ద నిర్ణయాలేవీ తీసుకోకండి.బంధువులను కలుస్తారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. మీరు వృత్తికి సంబంధించిన పనులను పూర్తి చేయగలుగుతారు.

Continues below advertisement