One Nation One Election Kovind Committee :  జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న కేంద్రం మరో ముందడుగు వేసింది. ఈ అంశంపై గతంలో నియమించిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికను గతంలో రాష్ట్రపతికి కోవింద్ సమర్పించారు. ఇందులో వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానాలకు అనుకూలంగా సిఫారసులు చేశారు. తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై బిల్లు పెట్టి ఆమోదింప చేసుకుంటే.. తర్వాత నుంచి జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.


జమిలీ ఎన్నికలకు  అనుకూలంగా కోవింద్ కమిటీ నివేదిక              


కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలకు అనుకూలంగా కీలక సిఫారసులు చేసినట్లుగా తెలుస్తోంది.  కమిటీ ప్రాథమిక నివేదికను మార్చి 15న నివేదికను సమర్పించింది.  మూడో సారి అధికారం చేపట్టగానే  ప్రధాని మోదీ నూతన ప్రభుత్వానికి నిర్దేశించిన తొలి 100 రోజుల ఎజెండాలో ఇది కూడా భాగమేనని ప్రకటించారు. ఆ ప్రకారం వందరోజుల పాలన ముగుస్తున్న సమయంలో ఈ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేశారు.  ముందుగా లోక్‌సభ, రాష్ట్రాల  శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అవి పూర్తయిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటి సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. 


కోట్లు సంపాదించే ఇండియన్స్ రాకెట్ వేగంతో పెరిగిపోతున్నారు - ఎలా సంపాదిస్తున్నారంటే ?


రాజ్యాంగ సవరణలు  చేయాల్సి ఉంటుందన్న నిపుణలు


అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణల  చేయాల్సి ఉంటుందని రాజ్యాగం నిపుణులు చెబుతున్నారు.  లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు  ఏకకాల ఎన్నికలు ,  ఏకకాల ఎన్నికల సుస్థిరత ,  కామన్‌ ఎలక్టోరల్‌ రోల్‌ కు సంబంధించిన అంశాలతో  రాజ్యాంగసవరణ చేయాల్సి ఉంటుంది.  జమిలీ ఎన్నికల కోసం అసెంబ్లీల కాల పరిమితి మూడు లేదా ఆరు నెలల కాలవ్యవధిని కుదించాల్సిన లేదా పెంచాల్సిన  రాష్ట్రాలు ఉంటాయి. అలాగే ఏ కారణంతో అయినా  ప్రభుత్వం పడిపోతే మిగిలినకాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించేలా సవరణ చేయాల్సి ఉంది.                


ప్రపంచాన్ని భయపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్‌- ప్రాణాంతకమంటున్న వైద్యులు- జాగ్రత్తపడాలని హెచ్చరిక


పార్లమెంట్ లో బిల్లు పెట్టిన తర్వాత కీలక పరిణామాలు                     


అయితే జమిలీ ఎన్నికలను  కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రాంతీయ  పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఉభయసభల్లో ఎన్డీఏకు  సాధారణ మెజార్టీనే ఉన్నందున.. రాజ్యాంగ సవరణలు సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి వ్యూహం పాటిస్తుందో కానీ.. రాజ్యాంగసవరణ చేయాల్సిన పరిస్థితి వస్తే.. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ అది  కోల్డ్ స్టోరేజీకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గతంలో మెజార్టీ పార్టీలు సానుకూలత వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధిస్తే బిల్లు పాసవడం సులభమేనని చెబుతున్నారు.