Top 10 Headlines Today:


చిరుత చిక్కింది 


ఓ చిన్నారి ప్రాణం తీసి... భక్తులను భయభ్రాంతులకు గురిచేసి.... అధికారులను పరుగులు పెట్టించిన మ్యాన్ ఈటర్ చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. మూడు రోజులు ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన చిరుతను తిరుమల తిరుపతి దేవస్థాన అటవీ అధికారులు రాత్రి బంధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కీలక భేటీ


తిరుమలలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ దిద్దుబాటు చర్యలు సిద్ధమైంది. ఓ చిన్నారిని చిరుత బలి తీసుకోవడంతోపాటు తరచూ నడక మార్గంలో వన్యమృగాల సంచారంపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే కఠినమైన ఆంక్షలు విధించాలని భావిస్తోంది. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గ్రూప్‌ 2 కొత్త షెడ్యూల్


లక్షల మంది విద్యార్థుల అభ్యర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సీఎం కేసీఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ ను రీ షెడ్యూల్ చేయాలని సూచించారు. సీఎస్ శాంతికుమారి, TSPSC చైర్మన్, కార్యదర్శులతో ఈ విషయంపై చర్చించారు. తాజాగా టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 2, 3 తేదీలలో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో మొత్తం 4 పేపర్ల పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఇవాళ్టి స్టాక్స్‌


ఇవాళ (సోమవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 52 పాయింట్లు లేదా 0.27 శాతం రెడ్‌ కలర్‌లో 19,427 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సిరీస్‌ పాయే


వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. అనంతరం వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కేసీఆర్‌ పాలనపై లోకేష్‌ పొగడ్తలు


ఏపీలో జగన్ పాలన, తెలంగాణలో కేసీఆర్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పాలనతో ఏపీ పేపర్లలో నిత్యం అఘాయిత్యాలు, కబ్జాలు, దాడుల వార్తలు కనిపిస్తుంటే.. తెలంగాణ పేపర్లలో నిత్యం పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమ వార్తలే కనిపిస్తున్నాయంటూ ఏపీలో పాలనపై సెటైర్లు వేశారు. సీఎం జగన్  కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. రావెలలో అమరావతి ఆక్రందన పేరుతో రాజధాని రైతులతో లోకేష్ ముఖాముఖీ నిర్వహించారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పవన్ పంచ్‌లు 


ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తనకున్న అనుబంధం ప్రజలకు తెలుసు, కానీ ప్రజలకే ప్రాధాన్యమని ప్రత్యేక హోదా కోసం వారితో విభేదించినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అమిత్ షా ఆఫీసుకు వెళ్లిన తాను.. సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో కూడుకున్నది మాత్రమే కాదు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం అని చెప్పానన్నారు. దీనికి ప్రత్యేకంగా గనులు ఇప్పించాలని, 30 వేల కార్మికులు ఆధారపడి ఉన్నారని చెప్పారు. పార్లమెంట్ లో చిన్న ప్లకార్డు కూడా పట్టుకునే ధైర్యం వైసీపీ నేతలకు లేదన్నారు. తాను కనీసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అడిగానని, వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆ పదమే నచ్చదంటున్న దుల్కర్


టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న పరభాషా నటులలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒకరు. 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్.. 'మహానటి' వంటి బ్లాక్ బస్టర్ మూవీతో నేరుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 'కనులు కనులను దోచాయంటే' 'కురూప్' చిత్రాలతో అలరించారు. గతేడాది 'సీతా రామం' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ అనే చిత్రంతో రాబోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జవాన్‌కు లీకుల టెన్షన్


ఈరోజుల్లో సినిమా షూటింగ్స్ అనేవి మరీ గోప్యంగా జరపడం కష్టంగా మారిపోయింది. ఎలాంటి సినిమా అప్డేట్ అయినా ఆడియన్స్ దగ్గరకు వెళ్లడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా చేయకపోయినా.. ఆ మూవీ గురించి అప్డేట్స్ అన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. దీంతో పాటు షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ అవుతున్న వీడియోలు కూడా మేకర్స్‌కు తలనొప్పిగా మారాయి. షూటింగ్ లొకేషన్‌లో ఫోన్లు ఉపయోగించకూడదు అని చాలావరకు సెట్స్‌లో రూల్స్ ఉన్నా కూడా వీడియోలు లీక్ అవ్వడం మాత్రం ఆగడం లేదు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమాకు కూడా ఈ లీక్ బాధ తప్పలేదు. దీంతో షాకైన మేకర్స్ పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సీబీఐపై ఒత్తిడి


మణిపూర్ హింసాకాండ ఘటనలపై సీబీఐ విచారణ ముమ్మరం చేస్తోంది. గతంలో అల్లర్లకు సంబంధించి 8 కేసులను సీబీఐ విచారణకు స్వీకరించగా దర్యాప్తు చేస్తుండగా కొత్తగా మరో 9 కేసులను సీబీఐ తాజాగా విచారణకు స్వీకరించింది. దీంతో సీబీఐ విచారణ చేసే కేసుల సంఖ్య 17కు చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య 17కే పరిమితం కాదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి