Manipur Violence: మణిపూర్ హింసాకాండ ఘటనలపై సీబీఐ విచారణ ముమ్మరం చేస్తోంది. గతంలో అల్లర్లకు సంబంధించి 8 కేసులను సీబీఐ విచారణకు స్వీకరించగా దర్యాప్తు చేస్తుండగా కొత్తగా మరో 9 కేసులను సీబీఐ తాజాగా విచారణకు స్వీకరించింది. దీంతో సీబీఐ విచారణ చేసే కేసుల సంఖ్య 17కు చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య 17కే పరిమితం కాదని అధికారులు తెలిపారు. 


మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఇతర కేసులను కూడా ప్రాధాన్యతపై సీబీఐకి రిఫర్ చేయవచ్చని పేర్కొన్నారు.  ఇప్పటివరకు, ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి, మణిపూర్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన రెండు కేసులు ఉన్నాయి. నివేదిక ప్రకారం, మరో తొమ్మిది కేసులను విచారణకు తీసుకునే యోచనలో ఉంది. 


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చురచంద్‌పూర్ జిల్లాలో లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ మరో కేసును విచారించనుందని నివేదిక పేర్కొంది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసం మహిళా అధికారులను కూడా సీబీఐ తమ బృందంలో చేర్చుకుంది. బాధిత మహిళల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడానికి ప్రశ్నించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


అల్లర్ల కారణంగా మణిపూర్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ క్రమంలో కేసు విచారణ సీబీఐకి కఠిన టాస్క్‌గా మారింది. ఆరోపణలు, పక్షపాతం లేకుండా విచారణ చేయడం సీబీఐకి కత్తిమీద సాముగా మారింది. ఒక వర్గం హస్తం అల్లర్లలో ఉందని నిర్దారిస్తే ఎవరి నుంచి ఎటువైపు నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు ఆలోచిస్తున్నారు. 


సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీల నిరోధక) చట్టం 1989 కిందకు రావొచ్చని, దీనిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి విచారించవచ్చని నివేదిక పేర్కొంది. 


కానీ మణిపూర్ లాంటి సున్నిత అంశాలల్లో డిప్యూటీ ఎస్పీలు పర్యవేక్షక అధికారులుగా ఉండలేరని, దీంతో కేసు దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ పోలీసు సూపరింటెండెంట్లను నియమించే ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చాలన్న మైటీల డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ కొండ జిల్లాల్లో ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ జరిగింది. దాని తరువాత మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికి పైగా చనిపోయారు. 


శాంతి ర్యాలీకి మేము సైతం: కాంగ్రెస్
మణిపుర్ అల్లర్లను ఆపేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించాలని కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి డిమాండ్ చేశారు. శాంతి పునరుద్ధరణకు దేశం మొత్తం తమ వెంట నిలుస్తుందని ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. సుమారు రెండు గంటలపాటు కూర్చుని మోదీ ప్రసంగం విన్నామని ఆయన చెప్పారు. కనీసం ఎక్కడా.. మణిపుర్​ అంశాన్ని మోదీ ప్రస్తావించలేదని విమర్శించారు. 


మోదీ ప్రసంగిస్తున్నప్పుడు వారి కేబినెట్​ మంత్రులే నిద్రపోయారని, సెషన్ల విజువల్స్​ చూడొచ్చన్నారు. ప్రసంగం ముగిసే సమయానికి మణిపుర్ అంశంపై మోదీ  కేవలం మూడు నిమిషాలే మోదీ మాట్లాడారని అన్నారు. మణిపుర్‌పై ప్రధాని మాట్లాడి ఉంటే, అల్లర్లను ఆపడానికి, ప్రజలను రక్షించడానికి, అక్కడ  శాంతి నెలకొల్పడంపై మోదీ మాట్లాడి ఉంటే తాము బయటకు వచ్చేవాళ్లం కాదన్నారు.