God Idol Gift: దానధర్మాలు చేయడం హిందూ ధ‌ర్మంలో అత్యంత పుణ్య కార్యంగా పరిగణిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం లభించడమే కాకుండా ఇంట్లో ఆనందం, శాంతి, సంపదలు కలుగుతాయి. ఆలయానికి దానం చేయడం వల్ల ఏడు తరాల పుణ్యం లభిస్తుంది. విరాళం లేదా బహుమతుల‌ గురించి ప్ర‌స్తావించినట్లయితే, సాధారణంగా మీరు దేవుడి విగ్రహాలు లేదా గణేశ ప్ర‌తిమ‌లను బహుమతిగా ఇవ్వడం చూసే ఉంటారు. లేదంటే స్వ‌యంగా మీరే అలాంటి విగ్రహాలను బహుమతిగా ఇచ్చి ఉంటారు. దేవుడి విగ్రహం, మూర్తులు కానుకగా ఇవ్వవచ్చా..?


దేవుడి విగ్రహాన్ని దానం చేయాలా వద్దా..?


మీరు నివసించే ప్రదేశానికి సమీపంలో ఎవరైనా ఆలయాన్ని నిర్మిస్తుంటే, మీరు ఆ ఆల‌యంలో ప్ర‌తిష్ఠించేందుకు దేవతల విగ్రహాలను దానం చేయవచ్చు. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. దీనితో పాటు మీ సంపాదనలో కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వాలి. కానీ దేవుని విగ్రహాన్ని వ్య‌క్తిగతంగా ఎవరికీ దానం చేయకూడదు. మనం ఎవరికైనా దేవుడి విగ్రహం లేదా బొమ్మను బహుమతిగా లేదా దానంగా ఇస్తే, మనం దేవుడిని మన ఇంటి నుంచి పంపిస్తున్నామని అర్థం. మరోవైపు దేవతా చిత్రాలతో కూడిన వెండి నాణేలు ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదు.


Also Read : ఇంట్లో దేవుడి విగ్రహం అకస్మాత్తుగా పగిలిపోతే దాని అర్థం ఏంటో తెలుసా?


వీటిని బహుమతులుగా ఇవ్వకూడదు


కత్తెర, కత్తి, సూది, దారం లేదా ఏదైనా ఇనుప వస్తువును ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది వాస్తు దోషాలను కలిగించడమే కాకుండా పరస్పర విభేదాలను కూడా పెంచుతుంది. ఇది పరస్పర భావాలను సృష్టించడ‌మే కాకుండా మీ సంబంధాలను పాడు చేస్తుంది.


తోలు వస్తువులను ఇవ్వవద్దు


పొరపాటున కూడా ఎవరికీ తోలు వస్తువులను బహుమతిగా ఇవ్వకండి. శాస్త్రం ప్రకారం బూట్లు, చెప్పులు, బెల్టులు, పర్సులు వంటి బహుమతులు శుభప్రదమైనవిగా పరిగణించరు. వీటిని బహుమతిగా ఇచ్చే బదులు, ఇతర వ‌స్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది.


సుగంధాలు, నూనె ఇవ్వకూడదు


ఎవరికీ సుగంధ ప‌రిమ‌ళాలు లేదా నూనె బహుమతిగా ఇవ్వకండి. ఇలా ఇవ్వ‌డాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. సాధారణంగా చాలా మంది సుగంధ ప‌రిమ‌ళాల సీసాల‌ను బహుమతులుగా ఇస్తుంటారు. ఇది ఇచ్చేవారు, పుచ్చుకునే వారి మ‌ధ్య స్నేహాన్ని చెడగొట్టవచ్చు.


ఈ మొక్కను ఇవ్వవద్దు


మనీ ప్లాంట్ మొక్కలు ఎవరికీ దానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు మీ ఇంటి సంపదను ఎదుటి వ్యక్తికి ఇస్తున్నారు. దీని ద్వారా మీరు పేదరికంతో బాధ‌ప‌డవచ్చు.


Also Read : మీ చేత్తో ఎవ్వరికీ ఇవ్వకూడని వస్తువులు ఇవే!


గడియారం


శాస్త్ర ప్రకారం గ‌డియారాన్ని ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని ఎదుటివారికి ఇస్తున్నారు. మీ మంచి సమయం ఎదుటి వ్యక్తికి వెళుతుంది. ఫ‌లితంగా మీకు క‌ష్ట కాలం ప్రారంభమవుతుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.