Traffic Rules: భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. మనం కూడా వార్తల్లో వాటి గురించి వింటూనే ఉంటాం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు
ఇది భారతదేశంలో చాలా తీవ్రమైన సమస్య. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటూ, ఖరీదైన జరిమానాలు విధిస్తున్నా, వీటి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి.


డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడకూడదు
కారు అయినా, బైక్ అయినా చాలా మంది ఈ అజాగ్రత్తతో కనిపిస్తుంటారు. రైడర్ లేదా డ్రైవర్ దృష్టి రోడ్డుపైనే ఉండాలి. తద్వారా ప్రమాదం లాంటి పరిస్థితి తలెత్తదు. కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది.


హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడపకూడదు
భారతదేశంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం కూడా తీవ్రమైన తప్పు. హెల్మెట్ ఉపయోగించడం ద్వారా రోడ్డు ప్రమాదంలో ముఖ్యంగా తలకు గాయం అయినప్పుడు కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అయినప్పటికీ చాలా మంది బైక్ రైడర్లు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం చూడవచ్చు.


ఆకస్మిక లేన్ మారకూడదు
ద్విచక్ర వాహనమైనా, నాలుగు చక్రాల వాహనమైనా అన్ని వాహనాల్లో సూచికలు ఉంటాయి. అయినప్పటికీ చాలా మంది వ్యక్తులు తమ కారును రోడ్డుపై నడుపుతున్నప్పుడు కుడి వైపు లేదా ఎడమవైపు ఒకేసారి తిప్పుతారు. కొన్నిసార్లు ఎడమ వైపు నుంచి ముందు ఉన్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తారు. ఇది కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది.


ఓవర్‌లోడింగ్ చేయకూడదు
చిన్న వ్యాపారం చేసే చాలా మంది వ్యక్తులు తమ బైక్ లేదా స్కూటర్ ద్వారా వస్తువులను తీసుకువెళతారు. ఇందులో గ్యాస్ సిలిండర్లు, వాటర్ క్యాన్లు కూడా ఉంటాయి. ద్విచక్ర వాహనంపై అధిక లోడ్ కారణంగా దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది.


మరోవైపు టీవీఎస్ మోటార్ నేకెడ్ అపాచీ ఆర్ఆర్ 310 టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. సాధారణంగా టీవీఎస్ తను లాంచ్ చేసే కొత్త ఉత్పత్తులను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతుంది. టెస్టింగ్ సమయంలో ఒక టీవీఎస్ బైక్ కనిపిస్తే దాని లాంచ్ త్వరలో జరగనుందని అర్థం. ఇటీవల టీవీఎస్ సెప్టెంబరు 6వ తేదీన కొత్త వాహనాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మార్కెట్లో నేకెడ్ అపాచీ ఆర్ఆర్ 310గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. స్పై షాట్‌లలో కనిపించినట్లుగా నేకెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 స్టైలింగ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్పష్టంగా కనిపిస్తుంది. దీని డిజైన్ కేటీయం డ్యూక్ 1290 సూపర్ డిజైన్‌ను గుర్తు చేస్తుంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial