వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ తడబడింది. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)... సూర్యకుమార్‌కు చక్కటి సహకారం అందించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగో టీ20లో శుభారంభం అందించిన శుభ్‌మన్ గిల్ (9: 9 బంతుల్లో, ఒక ఫోర్), యశస్వి జైస్వాల్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యారు. వీరిద్దరినీ అకియల్ హొస్సేన్ అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ముఖ్యంగా తిలక్ వర్మ ఎంతో వేగంగా ఆడాడు. అవతలి ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ తనకు సహకారం అందించాడు. మూడో వికెట్‌కు వీరు 49 పరుగులు సాధించారు. భాగస్వామ్యం బలపడుతున్న దశలో తిలక్ వర్మను రోస్టన్ ఛేజ్ రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ క్రీజులో నిలబడలేకపోయారు. కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. అయినంత వరకు సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాడు. అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జేసన్ హోల్డర్... సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేశాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
వెస్టిండీస్ తుది జట్టు
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial