అన్వేషించండి

Crisis in TMC - Mamatha's resilience test | ఓటమిని మించిన ప్రమాదంలో మమత పార్టీ

టీఎంసీ కోటకు బీటలుఈ సంక్షోభం దీదీ ప్రస్థానానికి ముగింపేనా ఓటమిని మించిన ప్రమాదంలో మమత ఉన్నారా

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మమతా బెనర్జీ సొంత పార్టీ నుండే పెద్ద సంక్షోభం ఎదుర్కొంటున్నారు.
  • గతంలోనూ అనేక సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించారు.
  • దాదాపు 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు పార్టీ భవిష్యత్తుకు ప్రమాదం.
  • ఇది దీదీ ప్రస్థానానికి అంతమా లేక మరొక పునరాగమనమా?
  • టీఎంసీ కోటకు బీటలు
  • ఈ సంక్షోభం దీదీ ప్రస్థానానికి ముగింపేనా 
  • ఓటమిని మించిన ప్రమాదంలో మమత ఉన్నారా

రాజకీయాల్లో సొంతవాళ్ల తిరుగుబాటును ఎదుర్కోవడం ప్రత్యర్ధులను ఎదుర్కోవడంకన్నా కష్టం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన మమతా బెనర్జీ ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మూడు దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాల్లో అప్రతిహత శక్తిగా నిలిచిన ఆమెకు ఈసారి సవాలు సొంత పార్టీ నుంచే వస్తోంది. ఏకంగా పార్టీని నిట్టనిలువునా చీల్చేంతగా పెరుగుతోంది.

ఇప్పటివరకు మమతా బెనర్జీ ఎదుర్కొన్న ప్రతి రాజకీయ సంక్షోభంలో ప్రత్యర్థి స్పష్టం. ఒకప్పుడు కమ్యూనిస్టులు, తర్వాత బీజేపీ. కానీ ఇప్పుడు ఆమె ఎదుట నిలబడిన వారు ఆమె స్వయంగా పెంచి పోషించిన నాయకులే. అందుకే 2026 సంక్షోభం మమత రాజకీయ జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు కానుంది. 

వీధి పోరాటాల నుంచి బెంగాల్ సీఎం దాకా పోరాడి గెలిచి...

మమతా బెనర్జీ రాజకీయ జీవితం భారత రాజకీయాల్లో అరుదైన కథ. కోల్‌కతాలోని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమెకు రాజకీయ వారసత్వం లేదు. ఆర్థిక బలం లేదు. ఉన్నదల్లా అసాధారణమైన పోరాట పటిమ మాత్రమే.

కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మమత, ఓ దశలో ఆపార్టీ సీనియర్లతోనే విభేదించి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ గొడవలో మమతపై బౌతిక దాడికూడా జరిగింది. కానీ దేనికీ వెరవకుండా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ప్రత్యక్ష ఉద్యమాలకు ప్రతీకగా మారారు. కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు చాలామంది ఆమెను తేలిగ్గా తీసిపారేశారు. ప్రతిపక్షమంటే కాంగ్రెస్ కాదు తృణమూల్ కాంగ్రెస్ అనేలా ఎదిగారు . చివరికి 2011లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికి చరిత్ర సృష్టించారు. అది కేవలం అధికార మార్పు కాదు. బెంగాల్ రాజకీయాల్లో ఓ సంచలన పరిణామం.

 'దీదీ' అంటే బ్రాండ్ ... పార్టీని మించి.

మమత విజయానికి ప్రధాన కారణం ఆమె వ్యక్తిత్వం. కన్యాశ్రీ, విద్యార్థి స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఆమెపై ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించాయి. ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌ను కాకుండా "దీదీ"ని విశ్వసించారు. అదే సమయంలో పార్టీ నిర్మాణం కూడా మమత చుట్టూనే తిరిగింది. నిర్ణయాలు, వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, రాజకీయ దిశ—అన్నీ దీదీ నే కేంద్రంగా పనిచేసాయి.ఈ విధానం అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలంగా పనిచేసింది. ఇప్పుడు ఆమె నాయకత్వానకీ, నిర్ణయాధికారానకీ అదే సవాలుగా మారింది. వారసుడు అభిషేక్ బెనర్జీకి శాపంగా మారింది. 

గతంలోనూ మమతను పనైపోయింది అన్నారు... 

మమత రాజకీయ జీవితంలో సంక్షోభాలు కొత్తవి కావు. విధ్యార్ధినాయకురాలిగా రాజకీయ ప్రవేశం చేసినప్పటినుంచీ ప్రతీ స్ధాయిలోనూ ఇదే ఆమెకు చివరి ఘట్టం అన్నంత పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతీ సారీ ధైర్యగా ఎదుర్కొన్నారు. ప్రతీ సారీ మరో మెట్టు ఎదిగారు. 

సింగూర్ – నందిగ్రామ్ ఉద్యమాల సమయంలో మమత మరీ పెట్టుబడులకు వ్యతిరేకంగాపోతున్నారు. కమ్యూనిస్టులే పరిశ్రమలను ప్రోత్సహిస్తుంటే భూములు, నిర్వాసితులు అనే నినాదం పనిచేయదు .. వ్యతిరేకత వస్తుందన్నారు. కానీ ఆపోరాటంతోనే కమ్యూనిస్టులను మట్టికరిపించారు. 
నందిగ్రామ్ పరాజయం – 2021 : తన రాజకీయ ప్రతిష్టకు ప్రతీకగా మారిన నందిగ్రామ్‌లో సువేందు అధికారికి ఓడిపోయినప్పుడు మమత రాజకీయంగా బలహీనపడతారని విశ్లేషణలు వచ్చాయి. కానీ అదే ఎన్నికల్లో తృణమూల్ 200కు పైగా స్థానాలు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. ఓటమిని విజయంగా మార్చుకోవడంలో మమత మరోసారి సత్తా చాటారు.

ఆర్జీ ఖర్ ఆస్పత్రి ఘటన : 2024లో జరిగిన వైద్య విద్యార్థిని హత్య కేసు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. భారీ నిరసనలు జరిగాయి. అయినప్పటికీ మమత రాజకీయంగా నిలబడగలిగారు. అందుకే ఆమె రాజకీయ ప్రస్ధానాని దగ్గరగాచూసిన వాళ్లు చెబుతారు.. సవాళ్లంటే మమతకు మరో మెట్టు అని.

కానీ 2026  అతి పెద్ద  ఛాలెంజ్.. ?

ఈసారి మమత ఎదుర్కొంటున్న సమస్య బయట శత్రువు కాదు.. పార్టీలో అంతర్గతంగా ఉన్న వ్యక్తులే.. గతంలో సువేందు అధికారి తనను ఎదిరించిప్పుడు, బీజేపీ 2021లోనే తన రాజకీయ పతనానికి అన్ని యత్నాలూ చేసినప్పుడు ఎదురొడ్డి నిలిచారు. కానీ ఈసారి సమస్య అత్యంత పెద్దది. పార్టీ ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది తిరుగుబాటు  చేయడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏకంగా పార్టీ మోత్తాన్నే చీల్చేంతగా.. అసలు పార్టీనే మాది అనేంత పెద్దది. ఇది కేవలం నాయకత్వంపై అసంతృప్తి మాత్రమే కాదు. ఇది పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి. ఏడు పదులు దాటిన ఓ రాజకీయ యోధురాలి పోరాట పఠమకు మరో పరీక్ష. 

మరి ఈసారి తట్టుకుని నిలబడగలదా ?

దీనికి నిర్ధిష్ట సమాధానం చెప్పడు కష్టం.  కానీ బెంగాల్ రాజకీయాల్లో భావోద్వేగాలు, ప్రాంతీయ భావం, వ్యక్తిత్వ రాజకీయాలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మూడు అంశాల్లోనూ మమత ఇప్పటికీ తిరుగులేని నాయకురాలే. బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో అసంతృప్తిని కలిగించే నిర్ణయాలు తీసుకుంటే, ప్రతిపక్ష నాయకురాలిగా మమతకు మళ్లీ అవకాశాలు రావచ్చు. మైనారిటీల మద్దతు ఎప్పటికీ మమతకే అదే సమయంలో వయసు, పార్టీ విభేదాలు, అవినీతి ఆరోపణలు, నాయకత్వంపై ప్రశ్నలు ఆమెకు ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంది.

అందుకే బెంగాల్ రాజకీయాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరి మదిలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది— ఇది దీదీ రాజకీయ ప్రస్థానానికి అస్తమయమా? లేక మరోసారి ఆమె పునరాగమనానికి ముందు నిశ్శబ్దమా? 

Frequently Asked Questions

ప్రస్తుతం మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటి?

ఆమె సొంత పార్టీలోనే నాయకుల తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం ఆమె రాజకీయ జీవితంలో అతిపెద్ద సవాలుగా మారింది.

మమతా బెనర్జీ రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించి, ముఖ్యమంత్రి అయ్యారు?

ఆమె కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2011లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికి ముఖ్యమంత్రి అయ్యారు.

మమత గతంలో ఎదుర్కొన్న సవాళ్లకు, ప్రస్తుత సంక్షోభానికి మధ్య తేడా ఏమిటి?

గతంలో ఆమె ప్రత్యర్థులతో (కమ్యూనిస్టులు, బీజేపీ) పోరాడారు. కానీ ఇప్పుడు ఆమె స్వయంగా పెంచి పోషించిన నాయకులే ఆమెకు సవాలుగా మారారు, ఇది అంతర్గత తిరుగుబాటు.

మమతా బెనర్జీ విజయానికి ప్రధాన కారణం ఏమిటి?

ఆమె వ్యక్తిత్వం, సంక్షేమ పథకాలు 'దీదీ'గా ప్రజల్లో ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించాయి. పార్టీ నిర్మాణం ఆమె చుట్టూనే తిరగడం కూడా ఆమె విజయానికి ప్రధాన కారణం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
Rahul Gandhi Protest:ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget