Tirupati News: కాకా హోటల్‌లో ప్రత్యక్షమైన ఆశిష్ విద్యార్థి - టిఫిన్ చేస్తూ సందడి!
Tirupati News: కరకంబాడిలోని ఓ చిన్న హోటల్ లో నటుడు ఆశిష్ విద్యార్థి సందడి చేశారు. టిఫిన్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అది చూసిన హోటల్ నిర్వాహకులు అసలు నమ్మలేకపోయారు.
![Tirupati News: కాకా హోటల్‌లో ప్రత్యక్షమైన ఆశిష్ విద్యార్థి - టిఫిన్ చేస్తూ సందడి! Tirupati News Actor Ashish Vidyarthi Having Tiffin Small Hotel Karakambadi in Tirupati Tirupati News: కాకా హోటల్‌లో ప్రత్యక్షమైన ఆశిష్ విద్యార్థి - టిఫిన్ చేస్తూ సందడి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/675713605f715865e82a3041a53a42f11677732976751519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirupati News: ఆశిష్ విద్యార్థి.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన తిరుపతి ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆశిష్ విద్యార్థి కరకంబాడిలోని ఓ రోడ్ హోటల్ లో టిఫిన్ చేశారు. తన మిత్ర బృందంతో కలసి అక్కడే టిఫిన్ చేశారు. వేడివేడి దోశతో తన అల్పాహారాన్ని ప్రారంభించానని ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేస్తూ హెడ్డింగ్ పెట్టారు. వేడివేడి దోశతో పాటు కరకరలాడే ఉద్ది వడ తినడం చాల బాగుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాను తిన్న దోశ చాలా కారంగా ఉందని ఇలాంటి దోశలు ఈశాన్య రాష్ట్రాల్లో దొరకవంటూ ట్వీట్ చేశాడు. పాపం ఆయన ఓ యాక్టర్ అని తెలిసి టిఫిన్ షాపు యజమానులు నోరెళ్లబెట్టారు.
పోకిరి, గుడుంగా శంకర్ సినిమాలతో మరింత మెప్పు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీ నటులు తమ నటనతో ప్రేక్షక దేవుళ్ల అభిమానాలను సొంతం చేసుకున్నారు. కథా నాయకులు కథలో పవర్ ఫుల్ గా ఉండాలంటే.. ప్రతీ నాయకుడు అంతకన్నా పవర్ ఫుల్ గా ఉండాలి. అలాంటి నటన చాలా మంది ప్రతినాయకులు సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొంత కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు ఆశిష్ విద్యార్థి. పోకిరి సినిమాలో ఆయన నటించి మెప్పించిన పోలీస్ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేరు. ఇక మహేష్ బాబు ఆగడు, పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమాలో ఆయన వేసిన పాత్ర కామెడీ పండించింది. సినీ జీవితంలో విలన్లు అయితేనేం... మా నిజ జీవితం వేరు అంటూ నిత్యం జనావాసంలో తిరుగుతూ ఉంటారు ఆశిష్ విద్యార్థి. ఇక ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. సుహాస్ కథానాయకుడుగా నటించిన చిత్రం రైటర్ పద్మనాభం. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు ఆశిష్ విద్యార్థి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఖుఫియా మూవీలో నటిస్తోన్నారు. ఈ చిత్రం ఎస్కేప్ టు నౌవేర్ అనే నవల ఆధారంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. టబు, అలీ ఫజల్, వామిక గుబ్బి.. ఇతర కీలక పాత్రలను పోషిస్తోన్నారు. ఈ ఏడాది జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆశిష్ విద్యార్థి ట్రావెలింగ్ లవర్..
నిత్యం వివిధ భాషల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఆశిష్ విద్యార్థి. వెబ్ సిరీస్ లో సైతం నటిస్తున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న సరే ఆయనకు వివిధ రకాల వంటకాలు అంటే చాల ఇష్టం అంతే కాదు ఆశిష్ విద్యార్థి ట్రావెలింగ్ లవర్ అని అంటారు కొందరు. రోడ్ సైడ్ హోటల్స్, స్ట్రీట్ ఫుడ్స్ ను ఆయన చాలా ఇష్టపడతారు. ఫుడ్ లో కొత్త రకపు రుచులను రుచి చూడటం అంటే చాల ఇష్టం. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో తాను విడిది చేసిన ప్రతి హోటల్, రోడ్ సైడ్ తినుబండారాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారు. బెంగాలీ ఫేమస్ రసగుల్లాను టీతో ట్రై చేశారు. ఇదో కొత్త రకం అనుభూతిని ఇచ్చిందంటూ ఓ వీడియోను షేర్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)