By: ABP Desam | Updated at : 03 May 2023 09:25 AM (IST)
Edited By: jyothi
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - హుండీ ఆదాయం ఎంతంటే?
Tirumala News: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు రద్దీ తగ్గింది. ప్రతి బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మంగళవారం రోజున 75,789 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 27,684 మంది తలనీలాలు సమర్పించగా, 4.35 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంతో భక్తులు కంపార్మెంట్ల్లో వేచి ఉండే పని లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది టీటీడి. ఇక ఉదయం ఏడు గంటలకు పైగా వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని ప్రవేశించిన టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా బుధవారం నాడు ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం, బెల్లంతో తయారు చేసిన పాయసంను స్వామి వారికి నైవేద్యంగా పెట్టారు.
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్ర కళషాభిషేకం" ను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవ విగ్రహాల పరిరక్షణ నేపధ్యంలో ఏడాదికి ఓమారు మాత్రమే నిర్వహించాలని ఆగమ సలహాదారుల మండలి సలహాల మేరకూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. అటు తరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే
Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!