అన్వేషించండి

Tina Dabi Athar Khan Divorce: ఐఏఎస్ టాపర్స్‌ జంటకు విడాకులు మంజూరు.. విడిపోయిన టీనా దాబి, అమీర్ ఖాన్ దంపతులు

Tina Dabi Athar Khan Divorce: అయిదేళ్ల కిందట దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఐఏఎస్ టాపర్స్ టీనా దాబి, అమీర్ ఖాన్ విడాకులు తీసుకున్నారు. జైపూర్ ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

కొన్నేళ్ల కిందట దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఐఏఎస్ టాపర్స్ అథార్‌ అమీర్‌ఖాన్, టీనా దాబి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజస్తాన్‌ కేడర్‌‌కు చెందిన ఈ ఐఏఎస్‌ జంట విడాకులు తీసుకుంది. జైపూర్ ఫ్యామిలీ కోర్టులో కొంతకాల కిందట వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది.

దేశంలో ఉన్నత సర్వీసులుగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలలో 2015లో వీరిద్దరూ టాపర్లుగా నిలిచారు. టీనా దాబి టాప్ ర్యాంకు సొంతం చేసుకోగా, కశ్మీర్‌కు చెందిన అమీర్‌ఖాన్‌ రెండో ర్యాంకు సాధించారు. అనంతరం వీరిద్దరికి ఒకే రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వడంతో సంతోషించారు. మరోవైపు ఒకే ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన టీనా, అమీర్ శిక్షణా కాలంలోనే ప్రేమలో పడ్డారు. రాజస్తాన్‌లో వీరిద్దరికీ పోస్టింగ్ లభించడంతో ఒకరికొకరు సమయాన్ని వెచ్చించేవారు. తమ పెళ్లి విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు. కానీ వీరి వివాహంపై అప్పట్లోనే దుమారం రేగింది. 

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న టీనా దాబి, అమీర్ ఖాన్‌కు జైపూర్‌లోనే పోస్టింగ్‌లు లభించాయి. 2018 మార్చి నెలలో టీనా, అమీర్ వివాహం చేసుకున్నారు.  అమీర్‌ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌ వీరి వివాహానికి వేదికగా మారింది. వివాహం చేసుకుని రెండేళ్లు గడిచిన తరువాత వీరి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. తమ మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి వివాహం జరిగిన సమయంలో లవ్ జిహాద్ అని కొన్ని హిందూ సంస్థలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా వీరి వివాహం చర్చనీయాంశమైంది. 
Also Read: మీ జీవితంలో ఆ ఇద్దరి మీదా ఎప్పుడూ నోరు పారేసుకోవద్దు… ఎవరా ఇద్దరు...

గత ఏడాది నవంబర్‌లో వీరు జైపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తాము కలిసి జీవించడం సాధ్యం కాదని, తాము పరస్పరం చర్చించుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు విన్నవించుకున్నారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివిన వారు, దేశంలోని ఉన్నత సర్వీస్‌లో తొలి రెండు స్థానాలు సాధించిన వారు కావడంతో విడాకులపై వెనక్కి తగ్గుతారని కుటుంబసభ్యులు భావించారు. కానీ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని, మూడేళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. వీరి విడాకుల కేసును తాజాగా విచారించిన జైపూర్ ఫ్యామిలీ కోర్టు టీనా దాబి, అమీర్ ఖాన్ తుది నిర్ణయాన్ని మరోసారి తెలుసుకుంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ టాపర్స్ జంటకు ఫ్యామిలీ కోర్టు మంగళవారం నాడు విడాకులు మంజూరు చేసింది.
Also Read: Nayanthara Engagement: డైరెక్టర్ తో లవ్ ఎఫైర్.. తొలిసారి స్పందించిన నయనతార..

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi On Gold Purchase: ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేద్దాం, చమురు వినియోగం తగ్గిద్దాం: ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi On Gold Purchase: ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేద్దాం, చమురు వినియోగం తగ్గిద్దాం: ప్రధాని నరేంద్ర మోదీ
Virat Kohli and Rohit Sharma News: ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ధోనీ సరసన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ధోనీ సరసన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ!
ABP Desam Top 10, 10 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 10 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS LSG Result Update: సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Renault Mini Duster: 30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
PM Narendra Modi: రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
Embed widget