News
News
వీడియోలు ఆటలు
X

ఆంబులెన్స్ కోసం 3 గంటల పడిగాపులు,తల్లి ఒడిలోనే ఆర్నెల్ల చిన్నారి మృతి

Wait For Ambulance: మధ్యప్రదేశ్‌లో ఆంబులెన్స్‌ రావడం ఆలస్యమై ఓ చిన్నారి మృతి చెందింది.

FOLLOW US: 
Share:

Wait For Ambulance: 

మధ్యప్రదేశ్‌లో ఘటన..

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఆంబులెన్స్ లేట్‌గా రావడం వల్ల ఓ ఆర్నెల్ల చిన్నారి మృతి చెందాడు. దటియాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంబులెన్స్ లేకపోవడం ఆ చిన్నారి ప్రాణాల్ని బలి తీసుకుంది. అనారోగ్యానికి గురైన చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. వెంటనే దటియాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ ఆంబులెన్స్ అందుబాటులో లేదు. అందుకోసం దాదాపు మూడు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ సిబ్బంది సమయానికి సరైన విధంగా స్పందించలేదని, అందుకో తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం ఆంబులెన్స్‌ని కూడా తెప్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ నిధులతో స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రికి మూడు ఆంబులెన్స్‌లు అందించారు. కానీ వాటిని హెస్త్ సెంటర్‌లో ఊరికే అలా పార్కింగ్ చేసి పెట్టారు. ఫ్యుయెల్ లేని కారణంగా పక్కన పెట్టారు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌ డివిజనల్ మెజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెంటనే స్పందించి ఆ ఆసుపత్రికి వెళ్లారు. తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించారు. 

"ఆంబులెన్స్‌ రావాలంటే ఓ ప్రోటోకాల్ ఉంటుంది. ముందు 108కి కాల్ చేయాలి. కానీ పేషెంట్ వెల్ఫేర్ కమిటీ కింద నడిచే ఆంబులెన్స్‌లు అందుబాటులోనే ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఇవి కచ్చితంగా స్పందించాలి. రోగులకు అవసరమైన సేవలు అందించాలి. ఎలాంటి డబ్బు తీసుకోకుండానే సర్వీస్ చేయాలి. ఏదేమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం"

- చీఫ్ మెడికల్ ఆఫీసర్ 

గతంలోనూ...

సాధారణంగా ఎవరినైనా ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను వినియోగిస్తారు. మరింత అర్జెంట్ అయితే ఏదైనా వాహనంలో తరలిస్తారు. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని జేసీబీలో తరలించిన వీడియో గతేడాది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌లోని కత్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖిటౌలీ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్సుకు ఫోన్ చేసినా సకాలంలో రాలేదు. దీంతో జనపద్ పంచాయతీ సభ్యుడు, జేసీబీ యజమాని అయిన పుష్పేంద్ర విశ్వకర్మ వెంటనే స్పందించి తన జేసీబీలోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వ్యక్తికి వెంటనే చికిత్స అందించగలిగారు వైద్యులు.క్షతగాత్రుడిని జేసీబీలో ఆసుపత్రికి తరలించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. వెంటనే స్పందించి బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన జేసీబీ యజమానిపై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు.

Published at : 29 Apr 2023 02:17 PM (IST) Tags: Madhya Pradesh Wait For Ambulance Ambulance Late Six Month Baby Baby Dies

సంబంధిత కథనాలు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ABP Desam Top 10, 29 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 29 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!