అన్వేషించండి

లద్దాఖ్‌కి రాష్ట్రహోదా డిమాండ్‌ చేస్తూ భారీ ర్యాలీ, చలిని లెక్క చేయకుండా రోడ్లపైకి వేలాది మంది

Ladakh Statehood: రాష్ట్రహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లద్దాఖ్‌లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ర్యాలీ చేపట్టారు.

Ladakh Statehood Demand: లద్దాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో బంద్ పాటించారు. లద్దాఖ్‌కి రాష్ట్రహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో తమ ప్రాంతాన్ని కలపాలని, తమను షెడ్యూల్‌ తెగలకు గుర్తించాలని డిమాండ్ చేశారు. లేహ్‌, కార్గిల్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల ఏర్పాటు చేయడంతో పాటు స్థానికులకు జాబ్ రిజర్వేషన్‌లు కల్పించాలన్న డిమాండ్‌లనూ వినిపించారు. రోడ్లపైకి వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్‌లు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. 

2019లో ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అప్పటి వరకూ జమ్ముకశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరవాత లద్దాఖ్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. అప్పటి నుంచి లద్దాఖ్‌కి రాష్ట్రహోదా కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఇప్పుడు  Leh Apex Body తో పాటు Kargil Democratic Alliance (KDA) ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తోంది. ఇప్పటికే కేంద్రహోం మంత్రిత్వ శాఖకి మెమొరాండం పంపాయి. లద్దాఖ్‌కి రాష్ట్రహోదా కల్పించాలని జనవరి 23వ తేదీన విజ్ఞప్తి చేశాయి. 

"లద్దాఖ్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినప్పటి నుంచి మేం నాలుగు డిమాండ్‌లు వినిపిస్తున్నాం. ప్రజల కేంద్రంగా ఉండే పరిపాలన అంతా ఒక్కసారిగా మారిపోయింది. మేం జమ్ముకశ్మీర్‌లో కలిసి ఉన్నప్పుడు మా ప్రాంతం తరపున అసెంబ్లీలో నలుగురు సభ్యులుండే వాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. లద్దాఖ్ ప్రజల తరపున మాట్లాడే ప్రతినిధి కచ్చితంగా అవసరం. అందుకే మాకు రాష్ట్రహోదా కావాలని డిమాండ్ చేస్తున్నాం"

- హాజీ గులామ్ ముస్తఫా, లేహ్ అపెక్స్ బాడీ 

లద్దాఖ్‌కి రాష్ట్రహోదా కల్పించాలని డ్రాఫ్ట్‌బిల్‌నీ తయారు చేసి కేంద్రహోం శాఖకు పంపినట్టు లేహ్‌ అపెక్స్ బాడీ ప్రతినిధులు వెల్లడించారు. మంత్రి నిత్యానంద్ రాయ్‌ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటైంది. లేహ్‌, లద్దాఖ్‌కి చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Cyclone Arnab Live Updates: రేపు ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
రేపు ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
Dhoni Secret Superpower: గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
జగన్ తీరుతో రాష్ట్రంతో పాటు ఫ్యామిలీలోనూ అన్ని ఇబ్బందులే.. కూటమితో హింస లేదు: సీఎం చంద్రబాబు
జగన్ తీరుతో రాష్ట్రంతో పాటు ఫ్యామిలీలోనూ అన్ని ఇబ్బందులే.. కూటమితో హింస లేదు: సీఎం చంద్రబాబు
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
Embed widget