అన్వేషించండి

Who is Atishi : అక్స్‌ఫర్డ్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం వరకూ - అతిషీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

CM Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్న అతిషీ మర్లోనా సింగ్ ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ అతిషీ మర్లోనా ఎవరు ? ఆమె ఎలా రాజకీయాల్లో ఎదిగారు ?

Delhi new CM Atishi : ఆమ్ ఆద్మీపార్టీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికి అతిషీ మర్లోవా సింగ్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కానీ ఆప్‌కు బలమున్న రాష్ట్రాల్లోనే ఆమె ఎక్కువగా చిరపరిచుతరాలు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పదవి చేపడతూండటం ద్వారా ఆమె ఇప్పుడు దేశంలోని ప్రముఖ నాయకురాలిగా మారారు. ఆమె రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. కానీ ఆక్స్ ఫర్డ్ నుంచి వచ్చారు. ఉన్నత చదువులు చదువుకున్నవారే భారత రాజకీయాలను మార్చగరని నమ్మి..  ఉన్నతమైన వ్యక్తిగత భవిష్యత్ ను పక్కన పెట్టి..  ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 

కేజ్రీవాల్  ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా ఉన్న అతిషీ      

అతిషీ మర్లోవా సింగ్.. కేజ్రీవాల్ ప్రభత్వంలో అనేక కీలక శాఖల మంత్రిగా ఉన్నారు. ఆప్ ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్ సీఎంగా.. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీరిద్దరూ జైలుకు వెళ్లడంతో అతిషీ యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయకుండా జైల్లో ఉన్నా పాలన సజావుగా సాగిందంటే దానికి కారణం అతిషీనే.కొన్ని సార్లు బీజేపే నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నా ఆమె వెనక్కి తగ్గలేదు. 

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషీ - కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఆప్ శాసనసభాపక్షం ఆమోదం
 
ఢిల్లీలోనే పుట్టి పెరగిన అతిషీ           

అతిషీ తల్లిదండ్రులు  ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు. ఆమె  బాల్యం , చదువు అంతా  ఢిల్లీలోనే సాగింది. చదువులో మంచి  ప్రతిభ చూపి ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో సీటు సంపాదించి అక్కడ చదివారు. మొత్తం ఆక్స్ పర్డ్ నుంచి రెండు పీజీలు చేశారు.  ఆ తర్వాత ఇండియాకు వచ్చారు. ఏడేళ్ల పాటు మధ్యప్రదేశ్ లోని ఓ చిన్న గ్రామంలో.. ఆర్గానిక్ ఫామింగ్ పై రైతులకు అవగాహన కల్పించేందుకు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేశారు.                                 

Also Read: RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
       
ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక పాత్ర 

ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. నిజానికి అసలు పేరు అతిషీ మర్లీనా సింగ్. కానీ తర్వాత తన పేరును కేవలం అతిషీగా మాత్రమే ఉంచుకున్నారు. మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మొదట సభ్యురాలిగా ఉన్నారు. మంచి వాగ్దాటీ , క్లీన్ ఇమేజ్ ఉన్న ఆమెను తర్వాత అధికార ప్రతినిధిగా నియమించారు. 2019 లోక్ సభ ఎన్నికలలో గౌతం గంభీర్ పైపోటీ చేసి ఓడిపోయారు.ఆయనా నిరాశపడలేదు. తర్వాత అ సెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు. ఆప్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. ఓ ఆక్స్ ఫర్డ్ అల్యూమినీ ఇలా ఢిల్లీకి సీఎం కావడం ఝిల్లీ ప్రజలుకు గర్వకారణమన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.       
  

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget