ఎలన్ మస్క్‌పై పిటిషన్ వేసిన మాజీ భార్య, కొడుకుని చూడనివ్వడం లేదని కోర్టుకి
Elon Musk sued: ఎలన్ మస్క్‌పై మాజీ భార్య గ్రిమ్స్ పిటిషన్ వేసింది.
![ఎలన్ మస్క్‌పై పిటిషన్ వేసిన మాజీ భార్య, కొడుకుని చూడనివ్వడం లేదని కోర్టుకి Tesla CEO Elon Musk sued by ex-partner Grimes over parental rights, Says Report ఎలన్ మస్క్‌పై పిటిషన్ వేసిన మాజీ భార్య, కొడుకుని చూడనివ్వడం లేదని కోర్టుకి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/520ab2c8c7c5a8d61f526d2581cca1bf1696418191623517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Elon Musk Sued:
మస్క్‌పై పిటిషన్
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk)పై మాజీ భార్య గ్రిమ్స్ (Grimes) తమ ముగ్గురి పిల్లల సంరక్షణ చూసుకోవాలని డిమాండ్ చేస్తూ దావా వేసింది. కెనడాకి చెందిన మ్యుజీషియన్ గ్రిమ్స్‌తో 2018 నుంచి 2021 వరకూ డేటింగ్ చేశాడు మస్క్. ఈ ఇద్దరికీ ముగ్గురు పిల్లలున్నారన్న సంచలన విషయం గత నెల వెలుగులోకి వచ్చింది. ఎలన్ మస్క్ బయోగ్రఫీ బుక్‌తో ఇది వెల్లడైంది. 2021లో వీళ్లిద్దరూ విడిపోయారు. అయితే...ఈ ముగ్గురి పిల్లలకు లీగల్‌గా మస్క్‌ని తండ్రిగా గుర్తించాలని సెప్టెంబర్ 29న శాన్‌ఫ్రాన్సిస్కోలోని సుపీరియర్ కోర్టుని ఆశ్రయించింది. గ్రిమ్స్ అసలు పేరు క్లారీ బౌషర్ (Claire Boucher). 2021 కన్నా ముందు వీళ్లిద్దరికీ ఓ కొడుకు పుట్టాడు. ఆ తరవాత కూతురు పుట్టింది. వీళ్లిద్దరి గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ...తమ ఇద్దరికీ మూడో బిడ్డ కూడా పుట్టాడని, అతని పేరు టెక్నో మెక్నానికస్ అని స్వయంగా ఎలన్ మస్క్ వెల్లడించాడు.
గ్రిమ్స్ ఆరోపణలు..
తన పిటిషన్‌లో గ్రిమ్స్ మస్క్‌పై పలు ఆరోపణలు చేసింది. ముగ్గురి పిల్లల్లో ఒకరిపై తనకు ఎలాంటి అధికారాలు లేకుండా మస్క్ అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తనను చూసేందుకూ వీల్లేకుండా చేస్తున్నారని మండి పడ్డారు. అందుకే ఆ పిల్లల తల్లిదండ్రులు తమను లీగల్‌గా గుర్తించాలని కోరింది. గతంలోనూ మస్క్‌తో తన రిలేషన్‌షిప్ గురించి మాట్లాడింది గ్రిమ్స్. మస్క్‌తో డేటింగ్ చేసిన రోజుల్ని మరిచిపోలేనని చెప్పింది. మస్క్‌కి మొత్తం ముగ్గురు మహిళలతో రిలేషన్ మెయింటేన్ చేశాడు. ఈ క్రమంలోనే 11 మంది పిల్లలకు తండ్రయ్యాడు. కెనడా సింగర్ గ్రిమ్స్‌కి ముగ్గురు పిల్లలు, కెనడా రచయిత జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు పిల్లలున్నారు. ఆ ముగ్గురి మహిళలతోనూ విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు గ్రిమ్స్ వేసిన పిటిషన్‌పై పూర్తి వివరాలు బయటకు చెప్పడం లేదు. దీనిపై ఎలన్ మస్క్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఎలాన్ మస్క్‌కు ఈ మధ్యే ఊహించని ప్రశ్న ఎదురైంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ అమెరికా పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మస్క్‌తో సమావేశమయ్యారు. న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ భవనం సమీపంలో ఉన్న టర్కిష్ హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. అయితే ఈ మీటింగ్‌కు మస్క్ తన కుమారుడు ఎక్స్‌ను తీసుకుని వచ్చారు. సమావేశం జరిగిన సమయంలో మస్క్ తన కొడుకును ఒడిలోనే కూర్చోబెట్టుకున్నారు. దీంతో ఎర్డోగాన్ బాబుతో ఆడుకునే ప్రయత్నం చేశారు. పలు మార్లు ఫుట్‌బాల్ బౌన్స్ చేసి పట్టుకొమ్మని అడిగారు. కానీ బాబు పట్టుకోలేదు. కొంచెం సేపటి తర్వాత టర్కీ అధ్యక్షుడి నుంచి మస్క్‌కు అనుకోని ప్రశ్న ఎదురైంది. మస్క్‌ను మీ భార్య ఎక్కడ అని ఎర్డోగాన్ అడిగారు. దీంతో మస్క్.. 'ఆమె శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఉంది. ఇప్పుడు మీము విడిపోయాం. అందుకే బాబును ఎక్కువగా నేనే చూసుకుంటున్నాను' అని సమాధానమిచ్చారు.
Also Read: Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)