Tirupati News: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత, పులివర్తి నాని ఆత్మహత్యాయత్నం
పోలీసుల తీరును నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు పులివర్తి నాని. ఇంత తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Tirupati News: తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంతంలోనే పక్కనే కూర్చున్నారు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు. శిబిరం నుంచి దూరంగా వెళ్ళాలని సూచించారు పోలీసులు. పోలీసులను దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు. పోలీసుల తీరును నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు పులివర్తి నాని. ఇంత తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ మహిళా కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్ళారు. దొంగ ఓట్లపై శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

