Top Headlines Today: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట- తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిపెస్టో
AP Telangana Latest News 03 May 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం - వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
వైఎస్ వివేకా హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో (Telangana Highcourt) వైఎస్ అవినాష్ రెడ్డికి (Ys Avinash Reddy) ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ రద్దు చేయాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణకు ప్రత్యేక మేనిపెస్టో - కేంద్రం తరపున కాంగ్రెస్ కీలక హామీలు
అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలతో పాటు బోలెడన్ని హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రత్యేకంగా ఓ మేనిఫెస్టో రిలీజ్ చేసింది జాతీయ కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ - పచ్చీస్ గ్యారంటీస్ పేరుతో ఓ మేనిఫెస్టో విడుదల చేసింది. దీన్ని తుక్కుగూడలో జరిగిన సభలో తెలుగులోనూ విడుదల చేశారు. అయితే తెలంగాణకు ఏమి చేస్తారో ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేయాలనుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్సీ మైనస్ - దండె విఠల్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
భారత రాష్ట్ర సమితికి వరుసగా కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ దండె విఠల్ పై అనర్హతా వేటు పడింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి దండె విఠల్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. దండె విఠల్‌కు రూ.50,000ల జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
'కన్నడ సెక్స్ స్కాంలో నారా లోకేశ్' అంటూ పేపర్ క్లిప్పింగ్ - అసలు నిజం ఏంటంటే?
ఇటీవల కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్) హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకి సంబంధించినవిగా చెప్తున్న పలు అశ్లీల వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో JD(S) పార్టీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, ఈ కన్నడ సెక్స్ స్కామ్ కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సంబంధం ఉందని.. ప్రజ్వల్ రేవణ్ణతో లోకేశ్ కు సత్సంబంధాలు ఉన్నాయనే అర్థం వచ్చేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రఘురామ ఇలాకాలో జగన్ పవర్‌ఫుల్ స్పీచ్
ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించారు. ఐదేళ్ల పాటు పార్టీలోనే ఉంటు వైసీపీని, అధినేత జగన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఇలాకా ఇది. అలాంటి ప్రాంతంలో జగన్ పవర్‌పుల్ స్పీచ్ ఇచ్చారు. టీడీపీని ముఖ్యంగా చంద్రబాబును జగన్ టార్గెట్ చేశారు. ఆయన చెప్పిన పథకాలు ఏవీ అమలు చేయరని ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మితే మోసపోయినట్టేనంటూ విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి